రాజకీయ పార్టీ నడపడం అంటే మాటలా ? రూ. కోట్లకు కోట్లు కావాలంటారు. అయితే వైసీపీ మాత్రం అసలు ఖర్చే లేకుండా పార్టీని నడుపుతోంది. ఈ విషయాన్ని వైసీపీనే చెబుతోంది. ఏడాది మొత్తం మీద వైసీపీ ఖర్చు కేవలం రూ.80 లక్షలు మాత్రమే . రూ. ఎనభై లక్షలతో పార్టీ కార్యాలయ అద్దె.. ఇతర ఖర్చులు కూడా రావు కదా మరి.. మిగతా అంతా ఎలా నడిపారు…పార్టీ కార్యకలాపాలు ఎలా నిర్వహించారు అనే డౌట్ వస్తే డౌట్ గానే ఉంచచుకోవాలి. ఎందుకంటే అది వైసీపీ మార్క్.
అదే సమయంలో అంటే ఏడాదిలో వైసీపీ వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా.. రూ. 108 కోట్లు. అక్షరాలా నూట ఎనిమిది కోట్ల రూపాయలు. ఇందులో రూ. కోటి కూడా ఖర్చు చేయలేదు. అదే తెలుగుదేశం పార్టీకి రూ. మూడున్నర కోట్లు కూడా విరాళాలు రాలేదు.. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెట్టేసింది. ఆ పార్టీ రూ.54.76 కోట్లు ఖర్చు చేసింది. టీఆర్ఎస్కు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది. టీఆర్ఎస్కు ఆదాయం తక్కువగానే ఖర్చు మాత్రం రీజనబుల్‌గానే చూపించింది. కానీ వైసీపీనే.. ఎలా బండి నడిపించిదో ఎవరికీ అర్థం కాదు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2020-21లో వచ్చిన విరాళాల గురించి అసోసియేషన్ ఆప్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఎవరు ఇస్తున్నారో తెలియని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నే వైసీపీకి ఎక్కువ నిధులు వచ్చాయి. మొత్తానికి అధికార పార్టీ అనే అడ్వాంటేజ్‌ను వైసీపీ అన్ని రకాలుగా వాడుకుంటోందని.. ఈ లెక్కలతో స్పష్టమవుతోంది.