కడప లోక్ సభకు ఉప ఎన్నికలు వస్తే గల్లీ.. గల్లీ తిరుగుతా.. వైఎస్ షర్మిలను గెలిపించుకుంటా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు మాట్లాడి ఇప్పటికే రెండు రోజులైపోతున్నా.. ఇంతవరకు వైసీపీ నేతలు స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తే.. జగన్ కడపకు పోటీ చేసే యోచనలో ఉన్నట్లేనని సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఆగిపోయారా..? లేక ఈ అంశంపై మరింత ఎక్కువగా చర్చ జరిగితే కడపలో షర్మిలకు ప్రాధాన్యత పెరుగుతుందని సైలెంట్ అయ్యారా..? అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
పైగా.. రేవంత్ ఈ ఒక్క అంశంపైనే మాట్లాడలేదు..జగన్ పై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. వైఎస్ కడవరకు వ్యతిరేకించిన బీజేపీతో అంటకాగుతున్నారని, అలాంటప్పుడు వైఎస్ కు రాజకీయ వారసుడు జగన్ ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ విషయం అటు షర్మిల, ఇటు రేవంత్ లేవనెత్తారు. వీటిలో ఏ ఒక్క విషయంపై వైసీపీ నేతలు నోరు మెదపకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ సమయంలో తాము బీజేపీకి మద్దతుగా లేమని ప్రకటిస్తే అది.. జగన్ కు , వైసీపీకి భవిష్యత్ లో ఇబ్బంది అవుతుందనే ఆ పార్టీ నేతలు స్పందించడం లేదా..? లేక ఈ అంశంపై మాట్లాడేందుకు నేతలు సాహసించినా జగన్ నుంచి అనుమతి లభించలేదా..? అని చర్చ జరుగుతోంది.