కర్నూలులో జరిగిన కారు ప్రమాదం విషయంలో వస్తున్న అనుమానాల విషయంలో విజయమ్మ లేఖ రాశారంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో ఓ లేఖను రిలీజ్ చేశారు. వైసీపీ అధికారికంగా రిలీజ్ చేయడంతో అందరూ నిజమని అనుకున్నారు. కానీ జగన్ రెడ్డి సలహాదారులు అంతా కలిసి ఆయనను మరోసారి బకరాను చేయడానికి ఫేక్ సృష్టించారని తేలింది. సంతకం ఫోర్జరీ చేసినట్లుగా కేసులు పెడతామని హెచ్చరికలు వచ్చాయేమో కానీ కాసేపటి తర్వాత ఆ లేఖను వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ గా డిలీట్ చేసుకుంద
దీంతో వైసీపీ ఆ లేఖను ఫేక్ చేసిందని అందిరికీ అర్థమైపోయింది. జగన్ రెడ్డిని నమ్మడానికి ఆమె తల్లి కూడా సిద్ధంగా లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. కారు ప్రమాదం విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలను అయినా ఖండించాలని జగన్ రెడ్డి తరపు నుంచి చేసిన రాయాబారాలకు సరైన ఫలితం లేకపోవడంతో వారే్ ఈ లేఖను తయారు చేసుకుని తామే సంతకం పెట్టేసుకున్నారు. అవతలి వైపు నుంచి సీరియస్ గా స్పందన రావడంతో వెనక్కి తగ్గారు.
జగన్ రెడ్డితో పాటు ఆయన క్యాంప్ మొత్తం ఎంత దిగజారాలో అంతకు దిగజారిపోతోంది. ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదో అలాంటి తప్పుడు పనులు చేస్తోంది. చివరికి పరువు పోగొట్టుకుంటోంది. జగన్ రెడ్డి ఇప్పటికైనా తాను ఎం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వైసీపీ క్యాడర్ లో వినిపిస్తోంది.