ప్రధాన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం వైసీపీ… ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేయడమే ప్రజాపోరాటం అనుకుంటోంది. వారి పని ప్రజల్ని ఏదో ఒకటి చేసి నమ్మించడమే. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించేశారంటూ తిరుపతి ఎంపీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అది మార్ఫింగ్ చేసిన జీవో. ఫేక్‌కు ఫ్యాక్ట్కు తేడా తెలియక కాదు ఆ ఎంపీ కావాలనే తప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే అదే ప్రతిపక్ష పాత్ర పోషించడం అని వైసీపీ అనుకుంటోంది.
సోషల్ మీడియాలో వైసీపీ ప్రతీ రోజా ఫేక్ వైరల్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ముఫ్పై జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని బాపట్ల జిల్లా, అనకాపల్లి జిల్లాలను రద్దు చేయబోతున్నారని అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. విజయవాడ వరదల సమయంలో బంగ్లాదేశ్ వరదల వీడియోలను వైరల్ చేశారు. పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే కందిపప్పు తూకం తక్కువ ఉందని వీడియోలు పోస్ట్ చేశారు. ఇక ఇసుకపై ఎంత ఫేక్ ప్రచారం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. విజయవాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల పేరుతో చేసిన ప్రచారానికి వైసీపీ చాలా ఖర్చు పెట్టింది.
నిజానికి ఈ ఫేక్ న్యూస్ పై చర్యలు తీసుకోవాలనుకుంటే ఎక్కువ సేపుపట్టదు. ఏపీ పోలీసులు పద్దతిగా ఉంటున్నారు. ఇదిగో మీరు చాలా తీవ్రమైన తప్పు చేశారు..చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం అని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎవరిరైనా అదుపులోకి తీసుకున్నా నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్రారెడ్డి వంటి వారికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు . సహనంతో ఉన్నామని తప్పుడు ప్రచారాలు చేస్తే అలా వదిలేస్తామన అనుకోవద్దని చంద్రబాబు అంటున్నారు. నష్టం జరిగిపోయాక ఏదో చేస్తే ప్రయోజనం ఏమిటని టీడీపీ క్యాడర్ గొణుక్కుంటోంది.