వైసీపీ హఠాత్తుగా పదకొండు నియోజకవర్గాల్లో ఇంచార్జులను మార్చింది. మార్పు అంటే పెద్దగా ఏమీ లేదు. ఓ నియోజకవర్గం ఎమ్మెల్యేకు మరో చోట ఇంచార్జ్ గా వేయడమే. ప్రస్తుతం ఉన్న చోట చేసిన ఘనకార్యాలను తట్టుకోలేక ప్రజలు ఓడగొడతారని క్లారిటీ రావడంతో.. వారి గురించి తెలియని నియోజకవర్గాలకు ఇంచార్జ్ లుగా వేశారు తమషాగా ఉన్న ఈ నియోజకవర్గాల ఇంచార్జుల మార్పుల్లో నిండా మునిగింది మాత్రం.. ఫిరాయింపు ఎమ్మెల్యే మద్దాలి గిరి.
చిలుకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణలోని ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన విడదల రజనీని.. గుంటూరు పశ్చిమ సీటుకు ఇంచార్జ్ గా నియమించారు. ఇక్కడ సిట్టింగ్ ఎ్మమెల్యే మద్దాలి గిరి పార్టీ మారి చాలా కష్టపడిపోయారు. చివరికి హ్యాండిచ్చారు. విడదల రజనీకి చాన్సిచ్చారు. ఇక మంగళగిరికి టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని.. అలాగే చిలుకలూరిపేటకు గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మల్లెల రాజేష్ నాయుడును ఇంచార్జ్ గా ప్రకటించారు. మేకతోటి సుచరితను.. ప్రతిపాడు నుంచి తాడికొడంకు మార్చారు.
ప్రత్తిపాడుకు ఓ ఆర్కిటెక్ట్ కు చాన్సిచ్చారు. అద్దంకి నుంచి బాచిన చెంచు గరటయ్య కుమారుడికి డోర్ చూపించారు. హనిమిరెడ్డి అనే డబ్బులు బాగా పెట్టగలిగే వ్యక్తికి ఇంచార్జ్ గా పోస్టు ఇచ్చారు. వేమూరులో ఓడిపోవడం ఖాయమని చెప్పుకుంటున్న మేరుగ నాాగార్జునను.. సంతనూతల పాడు ఇంచార్జ్ గా నియమించారు. వేమూరుకు .. కొండెపి వైసీపీ నేత వరికూటి అశోక్ బాబును ఇంచార్జిగా నియమించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండెపికి ఇంచార్జ్ గా నియమించారు. రేపల్లెకు ఈపూరి గణేష్ ను ఇంచార్జ్ గా ప్రకటించారు. ఇక గాజువాక నుంచి తిప్పలనాగిరెడ్డి కుటుంబాన్ని దాదాపుగా గెంటేశారు.అక్కడ రామచంద్రరావు అనే నేతకు అవకాశం కల్పించారు.