పదహారు మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు లేవు. ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వారు చేసిన అరాచకాలను కేసుల రూపంలోకి తెస్తే వారికి ఫ్యూచర్ అనేదే ఉండదు. ఇప్పుడు వారిని ఏం చేయాలా అని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రేపు అన్నదే ఉండదన్నట్లుగా చెలరేగిపోయిన వారు .. ఇవాళ ఆ రేపు వచ్చే సరికి ఏం చేయాలో పాలు పోక కిందా మీదా పుడుతున్నారు.
వైసీపీ హయాంలో టీడీపీని వర్గ శత్రువుగా పరిగణించి అధికారం దుర్వినియోగం చేసి ఏం చేయడానికైనా వెనుకాడని ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వలేదని చెప్పి కనీసం ఆఫీసుకు కూడా రావడం లేదు. అందుకే వారిని అత్యవసర పనులకు అందుబాటులో ఉండాలని డీజీపీ ఆదేశించారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ వచ్చి డీజీపీ ఆపీసులో ఉండాలని ఆదేశించారు. ఇదంతా వైసీపీ పుణ్యమే. తమ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ ఐపీఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్లు.. ఇతర ప్రలోభాలు ఆశ పెట్టి వారితో అడ్డగోలు పనులు చేయించారు. ఇప్పుడు వారు పడుతున్న వేదనకు కారణం వైసీపీనే..
ఇప్పుడు కూడావారిని వైసీపీ వదిలి పెట్టడం లేదు. వారికి మద్దతుగా ట్వీట్లు చేసి.. ప్రకటనలు కూడా ఇస్తోంది. దీంతో వారు ప్రస్తుత ప్రభుత్వ నమ్మకాన్ని ఎలాగైనా చూరగొని ఏదో ఓ పోస్టింగ్ పొందాలని .. కనీసం చేసిన తప్పుల ను పట్టించుకోకుండా ఊండేలా చూసుకోవాలని ఆరాటపడుతున్నారు.ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చెప్పిన పని చేస్తామని.. తమ తప్పేమీ లేదని చెప్పుకునేందుకు చాలా మంది ఆరాటపడుతున్నారు. వారికి ఆ అవకాశం కూడా కల్పించనీయకుండా సాక్షి, వైసీపీ చేస్తున్నాయి.
ఇప్పటికైనా ఆ ఐపీఎస్ అధికారుల్ని వైసీపీ వదిలేస్తే బెటర్. వారికి మద్దతివ్వాలని ఇంకా ప్రయత్నిస్తే వారి కెరీర్ నే కాదు.. చేసిన తప్పుడు పనులనికూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసినట్లే అవుతుంది. ఆ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తిస్తారో లేదోమరి !