వైసీపీ ఎప్పటికప్పుడు టీడీపీ, జనసేనలకు కావాల్సింత మైలేజ్ ఇస్తూ.. రాజకీయంగా వారిని బలపడేలా చేస్తోంది. ఎప్పుడో రెండు నెలలకోసారి బయటకు వచ్చే పవన్ పర్యటనను కూడా అడ్డుకుని ఎక్కడా లేనంత క్రేజ్ తెచ్చి పెట్టారు. రాజకీయ పోరాటాల్లో ఒకరినొకరు అడ్డుకోవడం అంటే… రాజకీయంగా ఎదుటి వ్యక్తిని బలోపేతం చేసినట్లే. రాజకీయ పార్టీలు సామాన్యంగా ఇతర పార్టీల వారికి ఇలాంటి చాన్సులు ఇవ్వవు. అయితే ఏపీలో భిన్నంగా జరుగుతోంది. విపక్షాలు రోడ్డెక్కకుండా చేసి.. వాటికి కావాల్సినంత ప్రచారాన్ని హైప్‌ను అధికార పార్టీ తెచ్చి పెడుతోంది.
చంద్రబాబు, లోకేష్ పర్యటనలను పదే పదే అడ్డుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ విశాఖ వస్తే అంతకు మించిన ప్రయారిటీ లేదన్నట్లుగా అడ్డుకున్నారు. అయితే ఇలా అడ్డుకున్న ప్రతీ సారి ఆ ఇష్యూ హైలెట్ అవుతోంది. రెండు , మూడు రోజుల పాటు చర్చనీయాంశమవుతోంది. పోలీసుల వైఖరిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. దీని వల్ల తలపెట్టిన కార్యక్రమం జరగకపోయినా విపక్ష పార్టీలకు అంతకు మించిన పబ్లిసిటీ వస్తుంది. ప్రభుత్వం తీరుపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడం వల్ల మూడు రాజధానుల గర్జన అంశం పక్కకుపోయింది. ఇదే కాదు.. గత మూడున్నరేళ్లుగా జరుగుతోంది. ఒకప్పుడు స్వేచ్చగా పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు ఇలా చేయడం వల్ల వల్ల అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగుతుంది. . విపక్షాలను బలపరుస్తున్నట్లవుతుంది. వైఎస్ఆర్సీపీ పెద్దలు ఈ అంశాన్ని ఆలోచించారో లేదో కానీ తెలిసో.. తెలియకో విపక్షాలకు బలంగా వైసీపీ వ్యూహమే మారుతోంది.