ఉమ్మడి కర్నూలు జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డి గురించి కథలు కథలుగా చెప్పుకోని వారు ఉండరు. ఫ్యాక్షన్ నేతగా… గడగడలాడించారు. ఇప్పుడు ఆయన కుటుంబం ఎలా అయిదంటే.. ఆ ఇంట్లో ఆడవాళ్లు.. ఫోటో ఫ్రేముల కోసం.. కారు పార్కింగ్ కొట్టుకుంటున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణం సీఎం జగన్ రెడ్డి. రెండు వర్గాలకు రాజకీయ ఆశ చూపి.. ఎవరికి వారు బలం నిరూపించుకోవాలన్నట్లుగా పోటీలు పెట్టడంతో ఇలా తయారయ్యారు.
2021 జనవరిలో ఎమ్మెల్సీగా ఉండగా చల్లా రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. తర్వాత జగన్ ఆయన కుమారుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన కూడా చనిపోయారు. దీంతో రాజకీయ వారసత్వం పై జగన్ మోహన్ రెడ్డి వద్ద పంచాయతీ జరిగింది. చల్లా రామకృష్ణారెడ్డి భార్య, మరో కుమారుడు.. భగీరథరెడ్డి భార్య…. రెండు వర్గాలుగా విడిపోయారు. మాకంటే మాకు చాన్సివ్వాలని పట్టుబట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏదీ తేల్చలేదు. ఎవరికి ఎక్కువ బలముంటే వారికే చాన్స్ అన్నట్లుగా వ్యవహారించడంతో రెండు వర్గాలు ఆధిపత్య పోరాటానికి దిగుతున్నాయి. అయితే ఇవి.. వీధిపోరాటాలకు కారణం అవుతున్నాయి.
తాజాగా చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయాలు కావడంతో చల్లా శ్రీలక్ష్మి బనగానపల్లి ఆసుపత్రిలో చేరారు. చల్లా శ్రీదేవి అవుకు ఆసుపత్రిలో చేరారు. శ్రీలక్ష్మీ అప్పట్లో సీఎం జగన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. కానీ ప్రయోజనం లేకపోయింది.