వైసీపీలో మహిళా నేతలూ తగ్గడం లేదు. విజయవాడలో ఓ మహిళా నేత యువతుల్ని ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతున్న వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇద్దరు యువతులు ఆమెపై నేరుగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ యువనేత అనచరురాలిగా ఎప్పుడూ హడావుడి చేస్తూ..సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే మహిళా నేతకు దుస్తుల దుకాణం ఉంది. ఆమె దుకాణానికి వచ్చే యువతుల్ని ట్రాప్ చేసిది. యువనేతతో ఉన్న పరిచయాలను చూపించి.. మాయమటలు చెప్పేది.
ఆకర్షితులైన వారి ఫోన్ నెంబర్లను తీసుకుని మొదట పార్టీలకు తీసుకెళ్లేది. మద్యం అలవాటు అయిన తర్వాత మెల్లగా అర్థనగ్న ఫోటోలు తీసి.. వాటితో తన వ్యాపారం ప్రారంభించేది. ఆ ఫోటోలను యువతులకే పంపి బెదిరించడమో లేకపోతే డబ్బులు బాగా వస్తాయని ఆశ పెట్టడమో చేసి.. వారిని వ్యభిచారకూపంలోకి దించేది. ఈ వ్యవహారంలో మోసపోయిన ఇద్దరు యువతులు నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొందరిని ఇప్పటికే వ్యభిచార వృత్థిలోకి దింపడంతో.. రహస్య విచారణకు సీపీ ఆదేశించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఆ మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది.
గతంలో రెండు గ్యాంగులు .. నడిబొడ్డున కత్తులు, కటార్లతో దాడులు చేసుకున్న వ్యవహారం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అందులో ఓ గ్యాంగ్ లీడర్ అప్పుడే చనిపోయారు. ఇంకో గ్యాంగ్ లీడర్ బతికే ఉన్నాడు. ఆయనతో కలిసి ఈ మహిళా నేత ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆరోపణలు పెరిగిపోవడంతో.. వస్త్ర దుకాణం కూడా తెరవడం లేదు. ఇప్పుడీ వ్యవహారం విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వైసీపీ నేత చేసిన నీచమైన పని కావడంతో పోలీసులు బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధపడటం లేదు.