కొత్త ఏడాదిలో వైసీపీ మాఫియాకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. కాకినాడ సెజ్, పోర్టును కొట్టేసిన దాని కంటే ఘోరంగా… విశాఖలోని బే పార్క్ ను కొట్టేశారు. ఈ విషయంపై అన్ని వివరాలను ఆధారాలతో సహా ఇప్పటికే సేకరించారు. ఇక్కడ కూడా అరబిందోదే కీలక పాత్ర. డీల్లో నేరుగా అప్పటి సీఎంవో కీలక పాత్ర పోషిచిందని చెబుతున్నారు.
బే పార్క్ విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో ఎకో టూరిజం ప్రాజెక్టు కింద బే పార్క్ ను నిర్మించుకున్నారు. ఇది రెవెన్యూ స్థలం. పర్యాటక శాఖకు ఇవ్వగా, అందులో ఎకో టూరిజం ప్రాజెక్టు పెడతామని ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 33 ఏళ్ల లీజుకు తీసుకుంది. కొండపై 28 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది అత్యంత విలాసవంతమైనది.
వైసీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుపై కన్నేశారు. యాజమాన్య హక్కులు మారిపోయాయి. కొన్ని బినామీ కంపెనీల పేరిట మారిపోయాయి. బే పార్క్ లీజు గడువు 2032 చివర్లో ముగుస్తుంది. అయితే వైసీపీ పెద్దలు ఈ లీజును 99 ఏళ్లకు పెంచుతూ 2023లో రిజిస్ట్రేషన్ పనులు పూర్తిచేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్దం. ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటకు తెచ్చారు. ఆ బినామీ కంపెనీలు ఎవరివి.. లీజు ఏకంగా 99 ఏళ్లకు పెంచడానికి చేసిన కుట్రేమిటో బయట పెట్టనున్నారు.