ye mantram vesave trailer review
https://youtu.be/ClWgR13DQpw
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతన్నుంచి మరో సినిమా వస్తోందంటే.. కచ్చితంగా అందరి దృష్టీ ఆ సినిమాపై పడుతుంది. అలా… అందరి కళ్లని తన వైపుకు తిప్పుకున్న సినిమా ‘ఏం మంత్రం వేశావే’. శివానీ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకుడు. ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అయితే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తరవాత వస్తున్న సినిమా అని తప్ప.. వేరే ఏ ఆకర్షణా ఈ ట్రైలర్లో కనిపించలేదు. సాంకేతికంగానూ.. పెద్ద గొప్పగా లేదు. చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. ‘అర్జున్ రెడ్డి’ కంటే ముందే మొదలైన సినిమా అది. ఆ తేడా విజయ్ మొహంలోనే కనిపిస్తోంది. అసలు ఈ సినిమాకి విజయ్ డబ్బింగ్ చెప్పాడా, లేదా? అనే డౌటూ కొట్టేస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఓ వీడియో గేమర్గా కనిపించబోతున్నాడు. `అమ్మాయిలు బొమ్మల్లాంటివాళ్లు. వారితో గేమ్స్ ఆడుకోవచ్చు’ అనే డైలాగ్‌ని బట్టి అతని క్యారెక్టరైజేషన్ అర్థం అవుతోంది. ‘ఆ పిల్లంటే నాకిష్టం. తనకేదన్నా జరిగితే ఊరుకోను’ అనే అర్జున్ రెడ్డి డైలాగ్‌ని ఈ సినిమాలో యధాతధంగా వాడేశారు.
అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ తరవాత వస్తున్న సినిమా కాబట్టి నిర్మాతలు క్యాష్ చేసుకోవొచ్చు. కానీ… విజయ్ కెరీర్‌కి ఇది ఎంత వరకూ ఉపయోగపడుతుంది అనేది మాత్రం సందేహమే.