తెలంగాణలో కేసీఆర్ సాధించినట్లుగా.. రాజకీయంగా.. కర్ణాటకపై పట్టు సాధించి.. తిరుగులేని నేతగా.. యుడియూరప్ప.. ఎదిగేందుకు ప్రయత్నించడం లేదు .. కానీ.. కేసీఆర్ రికార్డును బద్దలు కొట్టాలని మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ రికార్డు.. ప్రజాసంక్షేమ పథకాల్లోనో.. లేక.. మరో పాలనా పరమైన అంశంలోనో కాదు.. మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయకుండా.. అత్యధికకాలం గడిపేసే విషయంలో. ఇప్పటికే.. యడియూరప్ప.. ఓ అడుగు ముందే ఉన్నారు. ఏ విషయంలో అంటే.. మంత్రివర్గ ఏర్పాటు విషయంలో. యడియూరప్ప ముఖ్యమంత్రిగా జూలై ఇరవై ఆరో తేదీన ప్రమాణస్వీకారం చేశారు. రెండు, మూడు రోజుల్లోనే కేబినెట్ ఏర్పాటు చేసి… అసలు ప్రజాసంక్షేమ పాలన ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కానీ.. రెండు… మూడు.. రోజులు కాస్తా.. రెండు, మూడు వారాలవుతున్నాయి. కానీ మంత్రి వర్గ ప్రస్తావనే తేవడం లేదు.
కేసీఆర్ కూడా… ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. ఇలాగే కేబినెట్ లేకుండా రెండు నెలల పాటు గడిపేశారు. ఈ విషయంలో.. యడియూరప్ప.. కాస్త ఎక్కువే. ఎందుకంటే.. కేసీఆర్ కనీసం.. తనతో పాటు.. ఓ మంత్రితో ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనకు కీలకమైన శాఖలు ఇచ్చారు. ఆ ఒక్కరితోనే కేబినెట్ సమావశాలు కూడా నిర్వహించి రికార్డు సృష్టించించారు. కానీ.. యడియూరప్ప మాత్రం.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు తోడు ఎవరూ లేరు. ఆయన ఒక్కరే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలను చూసుకుంటున్నారు.
యడియూరప్పకు కష్టకాలం ఏమో కానీ… ఆయన బీజేపీ ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేలా.. మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది. అది కత్తి మీద సాములా మారింది. ఆయన తీసుకెళ్లిన లిస్టును.. బీజేపీ హైకమాండ్ పక్కన పడేసింది. మరో వైపు.. కర్ణాటకను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. 76 ఏల్ల యడియూరప్ప.. ఎంతగా వన్ మ్యాన్ షో చేద్దామనుకున్నా… కుదరడం లేదు. అధికారయంత్రాంగానికి సరైన దిశానిర్దేశం లేకపోవడంతో… విమర్శలు ప్రారంభమయ్యాయి. మరి యడియూరప్ప… కేబినెట్ లేకుండా.. కేసీఆర్ ఉన్నట్లుగా.. రెండు నెలల పాటు.. ఉండి.. రికార్డును సొంతం చేసుకుంటారేమో చూడాలి..!