వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేయడం మోదీ, షాల స్పెషాలిటీ. కానీ ఆ వారసత్వ రాజకీయాలకే వారు పెద్ద పీట వేస్తూంటారు. కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు.. అసెంబ్లీలో బీజేఎల్పీకి నాయకుడు లేకుండా పోయారు . చివరికి ఆరు నెలల కసరత్తు చేసి.. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు బీజేపీ కర్ణాటక చీఫ్ పోస్టు ఇచ్చారు. ఆయన మరో కుమారుడు ఎంపీగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ హైకమాండ్.. విజయేంద్రను ఎంపిక చేస్తుందని ఎవరూ అనుకోలేదు.
ఎదుకంటే అసలు యడ్యూరప్పనే కాదు.. ఆయన కుమారులిద్దర్ని రాజకీయాల నుంచి విరమించుకోవాలని గతంలో హైకమాండ్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ యడ్యూరప్ప లేకపోత.. బీజేపీ పరిస్థితి దారుణం అయిపోతుదని వెంటనే మనసు మార్చుకున్నారు. ఒకే సమాజికవర్గానికి చెందిన బొమ్మైను సీఎం సీటులో కూర్చోబెట్టినా ప్రయోజనం లేకపోయింది. చివరికి యడ్యూరప్ప కుమారుడికే పట్టం కట్టారు.
అందరూ విమర్సలు గుప్పిస్తారని తెలిసినా బీజేపీకి మరో దారి లేకుండా పోయింది. విజయేంద్రకే పట్టం కట్టారు. అయితే విజయేంద్రకు పార్టీ నడిపే అంత సామర్థ్యం ఉందాలేదా అన్నదానిపై చాలా విశ్లేషణలు ఉన్నాయి. కానీ యడ్యూరప్ప విజయేంద్ర వెనుక ఉంటారు కాబట్టి.. బండి నడిచిపోతుందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు సాధించడం కీలకమని..బీజేపీ భావిస్తోంది.