సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. తమిళ సినిమా వీరమ్ కి రీమేక్. వెంకటేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. మొన్న బతుకమ్మ పాట విడుదల చేసి తెలుగు ప్రేక్షకులు ద్రుష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఎట్రాక్షన్ వచ్చింది. ఈ సినిమా నుంచి వచ్చిన ‘ఏంటమ్మా’ పాటలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.
పాట విషయానికి వస్తే.. మాస్ బీట్. తమిళ పాటలా అనిపించింది. లిరిక్స్ కూడా తేడాతేడా గా వినిపించాయి. రామ్ చరణ్ కనిపించిన బిట్ లో మాత్రం పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో ”జొర్రమొచ్చిందో మామ జొర్రమొచ్చింది” అనే హుక్ ఫ్రేజ్ ని వాడినట్లు పాట విన్నవాళ్లకి అర్ధమౌతుంది.
ఇక డ్యాన్సుల విషయానికి వస్తే.. షారుక్ ఖాన్ చెన్నయ్ ఎక్స్ ప్రెస్ లో లుంగీ డ్యాన్స్ తో అలరించాడు. ఇప్పుడు సల్మాన్ కూడా సౌత్ టచ్ వున్న ఈ సినిమాలో లుంగీ తో ఆకట్టుకోవాలని చూశాడు. వెంకటేష్, సల్మాన్ ఖాన్ లకి తగ్గటే సింపుల్ కొరియోగ్రఫీ చేశారు. చరణ్ కూడా అవే సింపుల్ స్టెప్పులు వేయాల్సివచ్చింది. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ నిర్మాత. చరణ్ నిర్మాణంలో సల్మాన్ గాడ్ ఫాదర్ చేశాడు. ఇప్పుడు రిటన్ గిఫ్ట్ గా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ లో మెరిశాడు చరణ్.