సినిమాకో కథ ఉంటుంది ఆ కథను ప్రేక్షకులకు దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక్కొక్కరు ఒక్కో ఫార్ములాను ఎంచుకుంటారు.. కొందరు సరికొత్త టైటిల్స్ ను ప్రిఫర్ చేస్తే.. మరికొందరు మాత్రం ఆల్రెడీ ప్రేక్షకులకు నోటెడ్ అయిన టైటిల్స్ ను ఎంచుకుంటారు. ఆ దారిలోనే కోనా అంజలితో గీతాంజలి, నిఖిల్ తో శంకరాభరణం అంటూ సినిమాలు తీశాడు. అయితే గీతాంజలి హిట్ అయినా శంకరాభరణం అంటూ ఓ క్రైం కామెడీ సినిమా తీసి హిట్ సాధించకపోయినా ఆ టైటిల్ కు మాత్రం న్యాయం చేశాడు. అదేంటి కోనా వెంకట్ ఇలా తెలుగు ఓల్డ్ క్లాసిక్ సినిమా టైటిల్ మీద పడ్డాడంటే.. అదంతే ఎవరి స్టైల్ వారిదనుకోవాలి.
ఇక ఇప్పుడు కోనా తెలుగు క్లాసిక్ సినిమాల్లో చరిత్రగా చెప్పుకునే పాతాళ భైరవిని కూడా తన సినిమా టైటిల్ గా వాడుతున్నాడు. ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమాకు కోనా రచనా సహకారం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ పాతాళ భైరవి అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఏ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రభుదేవా తో పాటుగా పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే గీతాంజలి, శంకరాభరణం అంటూ ఓల్డ్ సూపర్ హిట్స్ టైటిల్స్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న కోనా ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో చూడాలి. హారార్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోనా మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తాడనే ఆశిస్తున్నారు సిని జనాలు.