సినిమా రంగంలో కి ప్రవేశిస్తున్న యువతులు… అవకాశాలు కరువైపోతే అడ్డదారులు వెతుక్కుంటూన్నారు. గతంలో నూ ఎన్నో సార్లు ఈ విషయం వెల్లడైంది. ఇప్పుడు తాజాగా ఇద్దరు వర్ధమాన తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడడం మరోసారి సినిమా రంగం ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో పెనవేసుకు పోతోందో వెల్లడించింది.
తాజాగా… శనివారం అర్ధరాత్రి నార్త్ జోన్ పోలీసులు స్టార్ హోటల్స్ పై చేసిన దాడుల్లో ఇద్దరు యువ కదానాయికలు వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. వీరిలో ఒకరు ఉత్తరాడికి చెందిన రిచా సక్సేనా కాగా మరొకరు బెంగాలీ నటి సుబ్రతో చటర్జీ. బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా, తాజ్ డెక్కన్ హోటల్స్ లో వీరిద్దరూ పట్టుబడ్డారు. వీరితో పాటు మౌనిక్ అనే బ్రోకర్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి రూ. 55 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ వేదికగా వీరి వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
గతంలో నూ చాలా సార్లు ఈ తరహాలో సినీతారలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యుక్త వయస్కురాలైన శ్వేతా బసు ప్రసాద్ ఉదంతం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి సినీరంగంలో ఇలాంటి వ్యవహారాలు సర్వ సాధారణం అని, వెలుగు చూసేవి అందులో ఒక్క శాతం కూడా ఉండవని బయట ఒక అభిప్రాయం ఉంది.