ఒకప్పుడు చిరంజీవితో సినిమా అంటే కనీసం నాలుగైదు హిట్లు కొట్టుండాలి. దర్శకత్వంలో మంచి అనుభవం కలిగివుండాలి. మాస్ పల్స్ తెలిసిన వాడైవుండాలి. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఓ హిట్టు కొడితే చాలు.. చిరంజీవితో సినిమా లైన్ క్లియర్ అయిపోతంది. చిరంజీవి కూడా ఇప్పుడు అలానే వున్నారు. ఓ విజయంఅందుకున్న దర్శకుడు.. చిరంజీవికి కథ చెప్పొచ్చు. అది ఓకే అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి.. ముందు దర్శకుడైతే చిరంజీవి లైన్ లోకి వెళ్ళిపోతున్నారు.
చిరంజీవి కూడా యువదర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఏ కొత్త దర్శకుడు కథ చెబుతున్నా వింటున్నారు. ఇప్పటికే చిరంజీవి తో సినిమాలు చేయాలనుకుంటున్న యువ దర్శకుల లిస్టు పెద్దదే వుంది. బింబిసార వశిష్ట, కళ్యాణ్ కృష్ణ కథలు దాదాపు ఒక అయిపోయాయి.
ఇప్పుడు మరో దర్శకుడు విజయ్ కనకమేడల కూడా చిరంజీవి కోసం కథ రెడీ చేసుకుంటున్నారు. చిరంజీవి ఆలోచన విధానం కూడా మారింది. తనని యువదర్శకులు కొత్తగా ప్రజంట్ చేస్తారనే నమక్మంతో వున్నారు. అలాగే తను చెప్పేది చెప్పినట్లుగా చేసే దర్శకుల వైపు చూస్తున్నారు. లిమిటెడ్ కాల్షీట్ లతో సినిమాకు చేయాలనే ఆలోచన ఆయనది. ఇందు కోసం యువ దర్శకులు బెస్ట్ ఛాయిస్ అనే భావనలో వున్నారు చిరంజీవి.