ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇది. ఇంత వరకూ ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ కనిపిస్తారనే అందరికీ తెలుసు. అయితే.. ఎన్టీఆర్ పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడు. తెలుగు 360కి అందిన విశ్వసనీయ సమాచారం నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్యే ఎన్టీఆర్. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే… ఎన్టీఆర్ యుక్త వయసు పాత్రని మరో హీరోతో చేయించాలని బాలయ్య భావిస్తున్నాడు. ఎన్టీఆర్ తన యవ్వన దశలో చాలా సన్నగా.. ఉండేవారు. ఆయన ముగ్థమనోహర రూపం అభిమానులకు గుర్తే. బాలయ్య ఇప్పుడు బాగా లావయ్యాడు. ఎంత స్లిమ్ అయినా… పాతికేళ్ల ఎన్టీఆర్‌గా కనిపించడం అసాధ్యం. అందుకే… ఎన్టీఆర్ కథానాయకుడిగా అడుగులు వేస్తున్న తొలి దశలో… ఆ పాత్రని మరో హీరోతో వేయించాలని భావిస్తున్నారు. ఆ పాత్ర ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు `మహానటి`లోనూ ఎన్టీఆర్ పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది. వాళ్లకే ఎన్టీఆర్ దొరకడం లేదు.. మరి `ఎన్టీఆర్` బయోపిక్‌కి ఎన్టీఆర్ దొరుకుతాడా… అనేది అనుమానంగా మారింది. ఆ పాత్ర కోసం ఎవరైనా కొత్తవాళ్లని తీసుకోవాలా, లేదంటే వర్థమాన కథానాయకుడ్ని ఎంచుకోవాలా అనే విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఆ హీరో ఎవరన్నది కూడా త్వరలోనే తెలుగు 360 బయటపెట్టబోతోంది. సో… ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన మరిన్ని తాజా వార్తల కోసం తెలుగు 360 చూస్తూనే ఉండండి.