దాదాపు కెరియర్ ప్రారంచించి దశాబ్ధ కాలాం కావొస్తున్న హీరో రామ్ స్టార్ గా నిలదొక్కులేకపోతున్నాడు. చేసే సినిమాలన్ని ఒకేలా ఉండటం రామ్ యాక్టింగ్ కూడా కొంచం కూడా మార్పు ఉండకపోవడంతో ఏదో రామ్ సినిమాలు వస్తున్నయంటే వస్తునాయంతే కాని హిట్ మార్క్ మాత్రం టచ్ అవ్వట్లేదు. అసలు రామ్ కెరియర్ ఎందుకు ఇలా నాశనం చేసుకుంటున్నాడు అనేది అర్ధం కాని విషయం నిన్న కాక మొన్నొచ్చిన హీరోలు సైతం డిఫరెంట్ జానర్ ఫిల్మ్ తో ఆకట్టుకుంటుంటే.. అదే స్టోరీలు.. అదే కొట్టుకోవటాలతో రామ్ సినిమా అంటేనే బోర్ గా ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు.
తన వెనుక స్రవంతి రవికిశోర్ లాంటి పెద్ద నిర్మాత ఉన్నా సరే రామ్ ఎందుకు కథ సెలక్షన్లో ఇలా పొరపాట్లు చేస్తున్నాడని అనుకుంటున్నారు. వచ్చిన కొత్తలో కుర్రాడు మంచి స్పీడ్ మీదున్నాడు స్టార్ రేంజ్ కి త్వరగానే పాకేస్తాడనుకున్నారు కాని సినిమాల రాంగ్ డెశిషన్ తో ఫ్యాన్స్ కి దూరమవుతున్నాడు. ఎంతో టాలెంట్ ఉండి కూడా రామ్ ఇలా చేయడం అతని అభిమానులకు కాస్త నిరాశగానే ఉంది. కొత్తదనం అనేది ఏ మాత్రం ట్రై చేయకుండా సినిమాలు చేస్తుండటం ఏమీ బాలేదు.
రామ్ యాక్టింగ్ కూడా అన్ని సినిమాల్లో ఒకేలా ఉండటం కూడా ఓ కారణం కథలో హీరో కనబడకూడదు క్యారక్టర్ కనిపించేంతలా హోం వర్క్ చేయాలి. కాని రామ్ వరుసెంట సినిమాలు చూస్తే సేమ్ కైండ్ ఆఫ్ క్యారక్టర్రైజేషన్ కనిపిస్తుంది. ఒకవేళ సినిమా సినిమాకు క్యారక్టర్ కొత్తదైనా రామ్ యాక్టింగ్ తో అది మళ్లీ పాత చింతకాయ పచ్చడే అవుతుంది. మరి హీరోగా స్టార్ క్రేజ్ ని సంపాధించుకోవాలంటే ఈ కోణాల్లో ఆలోచిస్తే బెటర్ లేదంటే అసలకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఈ క్లాస్ అంటా దీనికంటే నిన్న రిలీజ్ అయిన రామ్ శివమ్ సినిమాలో కూడా ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు ప్రేక్షకులకు. అందుకే సినిమాకు అన్ని చోట్ల యావరేజ్ టాక్ వచ్చింది.