విశాఖలో ఫిషింగ్ హార్బర్ లో బోట్లు తగలబడిన అంశం సంచనలం సృష్టించింది. ఏపీలో అరాచకానికి అంతే లేకుండా పోతోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసులు వెంటనే… రంగంలోకి దిగారు. ఓ యట్యూబరే దీనికి కారణం అంటూ లీకులు వదిలారు. అరెస్టు చేశామని కొన్ని మీడియాలకు… అరెస్టు చేస్తామని మరికొన్ని మీడియాలకు సమాచారం ఇచ్చారు. కానీ అరెస్టు చేశారో లేదో స్పష్టత లేదు. కానీ ఆ యూట్యూబర్ పై మాత్రం అనుమానాలు వచ్చేలా లీకులు ఇచ్చారు.
లోకల్ బాయ్ నాని పేరుతో ఓ మత్స్యకార యువకుడు యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఫిషింగ్ కు వెళ్లినప్పుటి వీడియోలు కూడా పెడతాడు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా యూట్యూబర్ లైవ్ పెట్టాడు. బోట్లు తగలబడిపోతున్నాయని చూపించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తర్వాత ఏం జరిగిందో కానీ.. యూ ట్యూబరే.. రాత్రి బోటులో పార్టీ ఇచ్చాడని.. ఆ పార్టీ లో గొడవపడ్డారని నిప్పంటించారని చెబుతున్నారు. అది కూడా అఫీషియల్ గా కాదు. ఆ యూట్యబర్ ను అరెస్టు చేశారో లేదో కూడా స్సష్టత లేదు. కానీ స్థానికులు మాత్రం భిననమైన కథలు చెబుతున్ననారు.
మరో వైపు మత్స్యకారుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. బోట్లకు పరిహారం చెల్లించాలని ధర్నా చేయడంతో ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వచ్చింది. సీఎం జగన్ ఈ ప్రకటనపై తీవ్రంగా స్పందించారని… కాలిపోయిన బోట్లకు ఎనభై శాతం ప రిహారం చెల్లిస్తారని ప్రకటించారు. మొత్తం 36 బోట్లు కాలిపోయాయని లెక్కలు తేల్చినట్లుగా ప్రకటించారు. ఈ పరిహారానికి ఎన్ని షరతులు పెడతారో తెలియదు కానీ.. మత్స్యకారులు మాత్రం ఇదేం ఖర్మ అని.. మథనపడుతున్నారు.