వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ఆయనకు సలహాలు ఇస్తున్న తాడేపల్లి ప్యాలెస్ నిపుణులు అంతా కలిసి వైఎస్ బ్రదర్స్ ఇమేజ్ ను గంగలో కలిపేస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తప్పని అరెస్టును తప్పించుకోవడానికి చిన్న పిల్లలాట ఆడటమే కాకుండా.. తల్లీని అడ్డం పెట్టుకోవడం ఏమిటన్న వైసీపీ ఫ్యాన్స్ లోనూ వస్తోంది. జగన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నారని కానీ అవినాష్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువ గా వినిపిస్తున్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విషయంలో తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ చెబుతోంది. అయనను అరెస్ట్ చేస్తారో లేదో కానీ సీబీఐ విచారణకు మాత్రం సహకరించడం లేదు. ఇదిగో వస్తా అని కోర్టులకు వెళ్లడం.కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయని విచారణకు వెళ్లకపోవడం వంటివి చాలా చేశారు. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు తల్లిని అడ్డం పెట్టుకున్నారు. ఉదయం పులివెందుల ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. అవినాష్ రెడ్డి ఆ కారణం చెప్పి పులివెందు బయలుదేరారు. సీబీఐ అధికారులు కూడా వెనకే రావడంతో తల్లిని అంబులెన్స్‌లో ఎదురు వచ్చేలా చేయించుకున్నారు. తాడిపత్రి దగ్గర కలిసి.. మళ్లీ హైదరాబాద్ బయలుదేరారు. కానీ కర్నూలులోనే ఆస్పత్రిలో చేర్పించారు. తనకు కూడా కడుపు నొప్పి అని ఆస్పత్రిలో ఇన్ పేషంట్ అయిపోయారు.
సీబీఐ అధికారులు కర్నూలు నుంచి వెళ్లిపోయారు. అయితే ఇవాళ అరెస్ట్ చేయకపోవచ్చు కానీ రేపు ఊరుకుంటారా అన్నదే ప్రశ్న. ఇక్కడ అవినాష్ రెడ్డి చెప్పే సిల్లీ రీజన్స్ కాకుండా .. సీబీఐ ఇమేజ్ కూడా ప్రధాన అంశం అవుతుంది. విచారణకు సహకరించని ఓ ఎంపీని అరెస్ట్ చేయలేరా అన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది. అందుకే వారు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డికి సంబంధించిన మొత్తం వ్యవహారం వైఎస్ బ్రదర్స్ ఇద్దరి సిల్లీ వ్యవహారాలను ప్రజల ముందు ఉంచుతోంది. ధైర్యంగా విచారణకు వెళ్లకుండా ఇలా నవ్వుల పాలవుతవుతున్నారేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. కానీ అదంతే .. వాళ్ల ఆలోచన.. తెలివిేతటలు.. అంతా అక్కడే ఉంటాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.