వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని ఒప్పేసుకున్నట్లు అవుతుంది. స్పందిస్తే.. చెప్పే సమాధానాలతో ఎంత దారుణమైన అబద్దాలు ఆడుతున్నామో ప్రజలకు అర్థమవుతుంది. ఈ మీమాసంతోనే ఆయన సజ్జల ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టుతో ప్రెస్ మీట్ పెట్టారు.
పాత ఆరోపణలన్నీ మళ్లీ చేశారు కానీ.. కనీసం సునీత ఆధారాలు బయట పెట్టి చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. వాట్సాప్ కాల్స్ చాలా స్పష్టంగా ఉంటే.. తన నెంబర్ ఎన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందని.. యాక్టివ్ గా ఉంటే.. తన పాత్ర ఉన్నట్లేనా అని ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు. కీలక సాక్ష్యంగా ఉన్న గూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందని అవినాష్ రెడ్డి తేల్చేశారు. వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుందని.. 100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందన్నారు. అది కూడా మూడేళ్ల తరువాత చూశారని లాజిక్ వివరించారు. మూడేళ్ల తర్వాత చూస్తే లోకేషన్ ఎక్కడో కనిపిస్తుందని.. తన ఇంట్లోనే చూపిస్తుందని ఆయన ఎందనుకుంటున్నారో మరి.
అసలు దర్యాప్తు ఎలా చేయాలో కూడా అవినాష్ రెడ్డి చెప్పారు. వాచ్ మెన్ రంగన్న స్టేట్ మెంట్ ఇచ్చారు కాబట్టి.. ఆ స్టేట్ మెంట్ లో ఉన్న నలుగుర్ని మందు అరెస్టు చేయాలట. దస్తగిరి హత్య చేశాడని ఒప్పుకున్నా.. సీబీఐ అధికారులు ఇంటికి పంపారని.. పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు చెప్పుకొచ్చారు. హత్య జరిగిన తర్వాత జగన్ కు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని.. సజ్జల స్టేట్ మెంట్లను ప్రెస్ మీట్లలో సునీతతో చదివించారు వైసీపీ నేతలు. ఇప్పుడు అవినాష్ అదే అసలు స్టేట్ మెంట్ అని వాదిస్తున్నారు.
అవినాష్ రెడ్డి వ్యవహారం నిండా మునిగిన తర్వాత చలేంటి అన్నట్లుగా ఉంది. తన తండ్రి 74 ఏళ్ల వయసులో జైల్లో ఉన్నారని.. అంటున్నారు. కానీ తండ్రిని జైలుకు పంపి.. తాను మాత్రం సీబీఐకి అడ్డుకుని మరీ హాయిగా బెయిల్ తెచ్చుకుని తిరిగేస్తున్నానన్నసంగతిని మాత్రం కన్వీనియంట్ గా మర్చిపోయారు.