సాక్షి పత్రిక నిర్వహణ ఎవరి చేతుల్లో ఉంటుంది ?. పేపర్ అయినా టీవీ అయినా … వైఎస్ భారతి చేతుల్లో ఉంటుంది. ఇది బహిరంగం. ఉన్నత ఉద్యోగులంతా ఆమెకే రిపోర్టు చేస్తారు. ఆమె ఆదేశాల మేరకే అంత నడుస్తుంది. కానీ ఇప్పుడు అసలు సాక్షికి.. వైఎస్ భారతికి సంబంధం ఏమిటని సాక్షి టీవీలో వైసీపీ వాళ్లే ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేదని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో సాక్షిలో పని చేసే వాళ్లు కూడా ఔనా అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
ఇంత హఠాత్తుగా ఇాలాంటి డిక్లరేషన్ ను ప్రజలకు ఎందుకు పంపుతున్నారంటే… అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచేసిన సొమ్ము విషయంలో సీఐడీ విచారణ ప్రారంభం కావడం. ఐదేళ్లలో ఆరు వందల యాభై కోట్లకుపైగా సాక్షి ఖాతాలో పడ్డాయి. వాలంటీర్లకు నెలకు ఇచ్చిన రెండు వందల జీవోను ఢిల్లీ హైకోర్టు ఉపసంహరించుకోవాలని.. రూల్స్ కు వ్యతిరేకంగా ఉందని ఆదేశించింది. అంటే అలా ఇచ్చిన రెండు వందల కోట్లు … చట్ట వ్యతిరేకమే. అవన్నీ సాక్షి ఖాతాల్లోకి పోయాయి. ఇప్పుడు వాటిపై సీఐడీ విచారణ జరగబోతోంది.
ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సంస్థకు ఇలా వందల కోట్లు దోచి పెట్టడం ఏదైతో ఉందో.. అది ఖచ్చితంగా ఆ సంస్థ యజమాని మెడకే చుట్టుంకుటుంది. అందుకే భారతిరెడ్డి వ్యూహాత్మకంగా తప్పించుకున్నారు. సూట్ కేసు కంపెనీల విషయంలో ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటారో.. అలాగే ఉంటున్నారు. లోపలికి ఎవరో బినామీల పేరు ఉంటుంది.. కానీ పెత్తనం చేసేది.. ఊడిగం చేయించేది వైసీపీకే. ఈ తెలివితేటల్ని మంచికి వాడి ఉంటే నమ్మిన ప్రజల్ని .. అధికారుల్ని అయినా బయటపడేసేవారేమో !