వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుల్ని కాపాడటానికి అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్న జగన్.. ఇందు కోసం సొంత కుటుంబసభ్యులపై దారుణమైన నిందలు వేయించడానికి వెనుకాడటం లేదు. చేతిలో మీడియా, సోషల్ మీడియా ఉండటంతో అడ్డూ అదుపూ లేకుండా వైఎస్ వివేకాపై నిందలు వేస్తున్నారు. ఇది కుటుంబంలో వివాదాలు మరింత తీవ్రం కావడానికి కారణం అవుతోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో అడ్డగోలు వాదనలు వినిపిస్తూ… హత్యను వివేకా కుమార్తె, , అల్లుడే చేయించారంటూ ఓ వాదన.. టీడీపీ నేతల హస్తం ఉందంటూ మరో వాదన.. అక్రమ సంబంధాలు అంటూ మరో వాదన వినిపిస్తూ తెరపైకి వస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దింపుతున్నారు. కానీ సొంత కుటుంబసభ్యులో అసలు నిజాలు చెబుతూ బయటకు వస్తున్నారు. వైఎస్ వివేకాపై చేస్తున్న అసత్య ప్రచారాలు.. ఇతర ఆరోపణలపై జగన చెల్లి షర్మిల సూటిగా స్పందించారు. తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న సాక్షిపై నేరుగా మండిపడ్డారు.
అంటే.. తప్పుడు ప్రచారాలు చేసే పెయిడ్ ఆర్టిస్టులందరూ ఓ వైపు ఉన్నారు.. వైఎస్ కుటుంబం మాత్రం సునీత వైపు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. సొంత బాబాయ్ ను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కుటుంబసభ్యుడ్ని జగన్ అడ్డగోలుగా సమర్థిస్తున్నారు. ఇందు కోసం ఆయన అందర్నీ దూరం చేసుకున్నారు. తప్పుడు ప్రచారం చేసే పెయిడ్ ఆర్టిస్టుల్నే నమ్ముకున్నారు. కానీ జనానికి కళ్ల ఎదురు నిజాలు కనిపిస్తున్నాయి. వాటిని కప్పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ … జగనే అసలు కుట్రదారేమో అందుకే ఇలా చేస్తున్నారేమో అన్న అనుమానాలు పెంచడానికి కారణం అవుతున్నాయి.