వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో రైతులకు మొత్తం రూ.61,400 ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మన రాష్ట్రంలో రైతులు యాభై లక్షల మంది రైతులు ఉన్నారంటూ.. ఒక్కొక్కిరికి రూ. లక్షా ఇరవై వేలకుపైగా.. ఇచ్చినట్లు లెక్క. అందరికీ సంక్షేమ పథకాలు అందవు కాబట్టి… వారిని తీసేస్తే.. ఒక్కొక్కిరికి లక్షన్నర అందినట్లుగా అంచనా వేయవచ్చు. అంటే… ప్రతీ రైతు.. ప్రభుత్వం వద్ద నుంచి పొందిన నగదే అంత పెద్ద మొత్తంలో పంపిణీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తన ప్రసంగంలో తెలిపారు కానీ.. ఏ ఏ పథకాల కింద పంపిణీ చేశారో మాత్రం చెప్పలేదు. దాంతో.. ఈ విషయంపై రాజకీయ పార్టీలు లెక్కలు తీయడం ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దాని ప్రకారం.. ఏడాదిన్నరలో రైతులకు ఇచ్చిన మొత్తం.. రాష్ట్ర బడ్జెట్లో దాదాపుగా సగం. అప్పులు లేకుండా.. రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతే ఉంటుంది. ప్రస్తుతం రైతు భరోసా కింద.. 40 నుంచి 45 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నారు. కేంద్రం రూ. ఆరు వేలు.. ఏపీ సర్కార్ రూ. ఏడున్నర వేలు కలిపి.. పదమూడున్నర వేల పంపిణీ చేస్తున్నారు. రైతులకు సంబంధించి ఇదొక్కటే మేజర్ పథకం. దీన్ని కూడా మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు. రైతు భరోసా పథకం కోసం బడ్జెట్లో దాదాపుగా ఆరున్నర వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు. మిగతా మొత్తం ఏ పథకాలకు కేటాయించారో స్పష్టత లేదు.
గత ప్రభుత్వ రైతు రుణమాఫీ కోసం రెండు వాయిదాలు చెల్లించాల్సి ఉంది. డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఈసీ నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ నిధులను నిలిపివేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఆపేశారు. రైతులకు సంబంధించి అనేక పథకాలను నిలిపివేశారని టీడీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అయినప్పటికీ.. తాము అరవై ఒక్క వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని ప్రకటించడం.. విపక్ష నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది.
ఏపీ సర్కార్ ఓ ప్రత్యేకమైన వ్యూహాన్ని పాటిస్తూ ఉంటుంది. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే నిధులను కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తుంది. ఇలా ఎన్నిరకాలుగా చూపించాలో.. అన్ని పద్దుల్లోనూ చూపిస్తుంది. కానీ ఇచ్చేది మాత్రం.. ఒక్క సారే. ఆ తరహాలో సంక్షేమ పథకాల్లో భాగంగా… పంపిమీ చేసిన నగదును.. రైతుల ఖాతాల్లో వేసి.. లెక్కలు చెబుతున్నారేమోనని.. విపక్షాల ుఅనుమానిస్తున్నాయి. అందుకే.. లెక్కలు చెప్పమని అడుగుతున్నారు