ఉచిత విద్యుత విషయంలో రైతుల్లో పెరిగిపోతున్న ఆందోళన నేపధ్యంలో ..సహచర మంత్రులకు.. జగన్ కొన్ని సూచనలు చేశారు. రైతులకు ఎలా సర్ది చెప్పాలో వివరించారు. రైతులు మీటర్‌కు కానీ… మరో విధంగా కానీ.. విద్యుత్ కోసం..ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని…అలాంటి పరిస్థితే రాదని.. జగన్ మంత్రులకు వివరించారు. ప్రస్తుతం ఏడాదికి ఒక్క రైతుకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి రూ. 49వేల 600 ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఇంత మొత్తాన్ని రైతు ఖాతాలో వేస్తామని.. ఆ రైతు ఖాతా నుంచి డిస్కమ్‌కు ఆటో డెబిట్ రూపంలో వెళతాయని…జగన్ మంత్రులకు వివరించారు.
ఉచిత విద్యుత్ పధకం నగదు బదిలీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా..శ్రీకాకుళం జిల్లాలో మొదట పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి..వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. రైతుల్లో పెరుగుతున్న సందేహాలను తీర్చడానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. అలాగే.. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని.. ఇప్పటికి అనధికారికంగా ఉన్న లక్షకుపైగా అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం మంత్రులకు స్పష్టం చేశారు. అలాగే.. రైతుల ఖాతాల్లో జమ చేసే విద్యుత్ బిల్లులు ఇతర అప్పులకు బ్యాంకులు తీసుకోకుండా…ప్రత్యేకమైన ఖాతాలు తెరుస్తామన్నారు.
సంస్కరణల అమలు ద్వారా వచ్చే 30 నుంచి 35ఏళ్ల వరకు ఉచిత కరెంట్ వస్తుందని జగన్ వివరించారు. నాణ్యమైన కరెంట్ పగటిపూట 9గంటలు ఇవ్వబోతున్నామన్నారు. ఉచిత విద్యుత్ బదులు నగదు బదిలీ పధకంలో సంస్కరణలు, దీనిపై రైతులకు వచ్చే సందేహాలను పూర్తిస్థాయిలో తీర్చాలని అధికారులు..మంత్రులను జగన్ ఆదేశించారు. పథకంలో మార్పులు చేయడం.. మీటర్లు పెట్టడం..కొత్త ఖాతాలు తెరవడం…అన్నీ…ఏదో ఓ స్థాయిలో రైతులకు ఇబ్బందికరంగా మారతాయని.. ఆచరణలో రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయని వైసీపీలో ఆందోళన ప్రారంభమయింది.