కేసీఆర్ ఔదార్యం ఏపీకి అవసరం అని.. ఇప్పుడు ఆయనపై ఎంతో ఔదార్యం చూపుతున్నారని.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా… పొరుగు రాష్ట్ర సీఎంపై తన కృతజ్ఞతా భావాన్ని చూపించారు. అంతటితో ఆగలేదు. ఆయన ఏపీకి గోదావరి నీళ్లు ఇచ్చేందుకే… కొత్త ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. కేసీఆర్ నీళ్లిస్తూంటే.. ప్రతిపక్ష పార్టీ వద్దంటున్నాయని… విమర్శలు గుప్పించారు. కానీ… అసలు నిజంగా మనకు కేసీఆర్ నీళ్లిస్తున్నారా..? మన నీళ్లలో అనధికారికంగా వాటా పొందుతున్నారా..? అనేది.. చర్చనీయాంశం అవుతోంది.
గోదావరి నికరజలాలపై సంపూర్ణ హక్కులు ఏపీవే కదా..!?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. తెలంగాణ సర్కార్‌తో.. అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో… రెండు ప్రభుత్వాలు చేసిన ఆలోచన.. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం. రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి.. పూర్తి చేయాలని ప్రాధమిక నిర్ణయానికి వచ్చాయి. ఎందుకు.. ఎమిటి ఎలా.. అనే దానిపై… చీఫ్ ఇంజినీర్ల స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. కచ్చితంగా కడతామని.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కడా. ఈ ప్రాజెక్ట్ సాకారం అయితే.. రాయలసీమకు నీటి కరువు ఉండదన్న అభిప్రాయం.. ఏపీ అధికార పార్టీ నుంచి వస్తోంది. కానీ.. జనవనరుల నిపుణులు, సీనియర్ నేతలు మాత్రం.. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర హక్కు అయిన నీళ్లను తెలంగాణ వాడుకునేందుకే ఈ ప్రాజెక్ట్ అని లెక్కలు వివరిస్తున్నారు.
మరి కేసీఆర్ ఎ లెక్కన ఏపీకి నీళ్లిస్తారు..?
జలాలు, ప్రాజెక్టుల విషయంలో.. మంచి పరిజ్ఞానం ఉన్న సీనియర్ నేతలు మైసూరారెడ్డి, తులసీరెడ్డి కడపలో.. ఓ మీటింగ్ పెట్టారు. నిపుణులతో చర్చించారు. ఓ మ్యాప్ పెట్టి… అసలు.. తెలంగాణ సీఎం.. జగన్మోహన్ రెడ్డిని ఎలా బోల్తా కొట్టిస్తున్నారో వివరించారు. గోదావరి నికర జలాలపై సంపూర్ణ హక్కులు… ఆంధ్రప్రదేశ్‌కే ఉన్నాయని మైసూరారెడ్డి, తులసీరెడ్డి గుర్తు చేశారు. ఆ మిగులు జలాల్ని ఏదోలా తీసుకునేందుకే తెలంగాణ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలు పెట్టిందని.. చెబుతున్నారు. గోదావరి నీటిని శ్రీశైలం తీసుకొచ్చేందుకు కొత్తగా ప్రాజెక్టులు కట్టాల్సిన పని లేదంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ 400 టీఎంసీలు ఉంటుందని.. సీజన్లో ఆ నీళ్లన్నీ వాడుకునే ఛాన్స్ మనకు ఉందని వారంటున్నారు. గోదావరి నికర జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడు… పక్క రాష్ట్రంతో కలిసి పంచుకోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ నీటిని తెలంగాణ వాడుకోవడం కోసం ఏపీ ఖర్చా…?
తెలంగాణ ప్రతిపాదించిన కొత్త ప్రాజెక్టు ద్వారా పులిచింతలలో.. నీటిని నిల్వచేసి.. అక్కడ్నుంచి డెల్టా అవసరాలు తీర్చాలనుకుంటున్నారని.. ఆ పని ఇప్పుడే చేస్తున్నారు కదా… అని.. తులసీరెడ్డి, మైసూరారెడ్డి అంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ ద్వారా.. ఆంధ్రప్రదేశ్‌కు వాటాగా రావాల్సిన నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్నే ఖర్చు పెట్టి.. ప్రాజెక్ట్ నిర్మించడం అవుతుందని ఎవరికైనా అర్థం అవుతుందంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే.. ఇది మరింత స్థిరీకరణ అవుతుందంటున్నారు. అసెంబ్లీలో తెలంగాణ సీఎం ఏపీకి నీళ్లిస్తున్నారని జగన్ చెప్పడం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది. మైసూరా, తులసీ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు.. రాజకీయంగానూ.. హైలెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.