ప్రత్యేకహోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఏమి వస్తుంది..?. హోదా వల్ల సామాన్య ప్రజలకు.. ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఆ విషయం… ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రానికి మాత్రం… అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా.. ప్రత్యేకహోదా వస్తే.. పారిశ్రామిక రాయితీలు వస్తాయి.. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తాయన్న ప్రచారం ఉంది. అసలు ప్రత్యేకహోదాకు డిఫైనేషన్ ఏమిటో చెప్పాలని.. చాలా మంది అంటూ ఉంటారు కానీ… ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్న ప్రయోజనాలు మొత్తం.. ప్రత్యేకహోదా ద్వారా ఏపీకి వస్తాయి. అంతే.. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆదాయపు పన్ను కడుతున్నారు. వారు కూడా… జీఎస్టీ కడుతున్నారు.
పన్నులకు.. ప్రత్యేకహోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలేమీ అతీతం కాదు. ఈ విషయం… దేశంలో ఉన్న అంతో.. ఇంతో చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తెలియదు. నిజంగానే తెలియదో..తెలిసి కూడా.. తెలియనట్లు చెబుతారో కానీ… ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకహోదా వస్తే.. ఇన్‌కంట్యాక్స్, జీఎస్టీ ఉండవని చెబుతూ ఉంటారు. గతంలో ఓ సారి ఇలాగే చెబితే.. ఇంటర్నెట్లో ట్రోలింగ్స్ వచ్చాయి. అప్పుడు తెలుసుకుని ఉంటారేమో అనుకున్నారు కానీ.. తెలుసుకోలేదు. ఆయన ఇప్పుడు ప్రచారసభల్లోనూ అదే చెబుతున్నారు. చివరికి జాతీయ మీడియా ఇంటర్యూల్లోనూ అదే చెబుతున్నారు. న్యూస్ 18 చానల్ ఇంటర్యూలోనూ ప్రత్యేకహోదా గురించి చెబుతూ అదే చెప్పారు.
ఆ జర్నలిస్టులకు ఏమైనా అర్థం అయిందో లేదో కానీ.. వేరే టాపిక్ కు వెళ్లిపోయారు. అయితే..జగన్ గురించి.. ఆయన అవగాహన గురించి అందరికీ తెలియాలనుకున్నారేమో కానీ.. ఇంటర్యూల్లో దాన్ని కూడా హైలెట్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎవరికీ ఆదాయపు పన్ను కానీ.. జీఎస్టీ కానీ మినహాయింపు రానే రాదు. ఈ విషయంలో.. జగన్మోహన్ రెడ్డికి.. చెప్పేవారు ఎవరూ లేరేమో..?