వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు కోట్ల మంది ఓటర్లలో 59 మంది నకిలీ ఓటర్లేనని నిర్దారించారు. ఎన్నికల సంఘానికి కూడా.. 59 లక్షల మంది ఓటర్ల వివరాలను… పెన్ డ్రైవుల్లో పెట్టి ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆ ఓటర్ల జాబితా ఆయనకు ఎలా వచ్చిందో కానీ ఆ యాభై తొమ్మిది లక్షల మంది నకిలీ ఓటర్లని ఎలా ప్రాసెస్ చేశారో కానీ.. మొత్తానికి తను చెప్పిన 59 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తీసేయాల్సిందేనని తీర్పు చెబుతున్నారు. అవి తీసేయకపోతే… ఎన్నికల సంఘం తప్పు చేసినట్లేనని మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు రెండేసి ఓట్లు ఇస్తున్నారని.. వైసీపీ కార్యకర్తల ఓట్లు తీసేస్తున్నారని చెప్పుకొచ్చారు. తీసేసిన వాటి వివరాలు ఆయన… ఈసీకి ఇవ్వడం లేదు కానీ.. తీసేయాలని మాత్రం.. 59 లక్షల ఓట్లకు లెక్క చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఫామ్-7లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఒక ఓటర్కి తెలియకుండా… ఆయన ఓటు తీసేయాలని దరఖాస్తు చేయడం.. చట్ట విరుద్ధం. దానికి క్రిమినల్ కేసు పెడతారు. ఏడేళ్ల వరకూ శిక్ష ఉంటుంది. ఆ విషయం తెలియనట్లు… కేవలం ఓటును పరిశీలించాలని.. పెట్టిన దరఖాస్తు అని జగన్మోహన్ రెడ్డి కవర్ చేసుకుంటున్నారు. ఫామ్ -7లు తామే పెట్టినట్లు నెల్లూరులో జగన్ అంగీకరించకముందు… అదంతా.. టీడీపీ నేతల పన్నాగమని ప్రచారం చేశారు. ఇప్పుడు.. అసలు ఫామ్ -7 తప్పు కాదని వాదిస్తున్నారు. చట్టం తెలియకుండా.. ఫామ్ – 7లు దుర్వినియోగం చేయడమే కాకుండా.. దొరికిపోయిన తర్వాత తప్పు లేదని వాదిస్తున్నారు.
ఏ విధంగా అయినా 59 లక్షల ఓట్లను తొలగించాలనే ప్రయత్నం మాత్రం లోటస్ పాండ్ నుంచి చాలా రోజులుగా సాగుతోందని జగన్ మాటల ద్వారా తెలుస్తోంది. దొంగ ఓట్లు అని ఆరోపిస్తూ.. టీడీపీ కార్యకర్తల ఓట్లపై.. పామ్ -7 గురి పెట్టారు. … విచారణలో.. అవన్నీ .. దొంగ ఓట్లు కాదని… అక్కడ ఓటర్లు ఉన్నారని.. తెలుతోంది. అందుకే క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇలా ఇప్పటికి 300కుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినా కానీ జగన్ ఈ ఓట్లను దొంగ ఓట్లు అనే అంటున్నారు. ఈ కోణంలో చూస్తే.. టీడీపీ కార్యకర్తలందరవి దొంగ ఓట్లేనని.. ఆయన అభిప్రాయం. బహుశా.. వాటిని తొలగిస్తేనే ఎన్నికల్లో పాల్గొంటానని రేపు ప్రకటన చేస్తారేమో..?