సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత ఆయన ప్రజాదర్భార్ నిర్వహించాలనుకుంటే ఏంచేయాలా అని ఆలోచించారు. వెంటనే ఇంటి దగ్గర ఓ టెంట్ వేయడానికి కొన్ని లక్షలు విడుదల చేశారు. ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ప్రకటించారు. పాదయాత్లలో కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చారు. వెంటనే సీఎం అయ్యారు. అంతే.. తమ గోడు చెప్పుకుందామని.. కొన్ని వందల మంది వచ్చేశారు. దీంతో జగన్ కూడా కంగారుపడ్డారేమో కానీ రాత్రికి రాత్రి ప్రజాదర్భార్ క్యాన్సిల్ చేసేశారు. అయితే అప్పటికే అందరూ వచ్చారు. అయినా ఒక్కరి దగ్గర కూడా వినతి పత్రం తీసుకోకుండా పంపేశారు. అది మొదలు.. మూడున్నరేళ్లయినా ప్రజాదర్బార్ ప్రారంభం కాలేదు.
ప్రజల్ని జగన్ కలవడం జరగడం లేదు. ఇటీవల కూడా ఎమ్మెల్యేలతో పాటు ప్రజలను కూడా కలుస్తారని ప్రజాదర్భార్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పూర్తిగా అలాంటిదేమీ ఉండదని.. ఫోన్ల ద్వారా పనులు చేయిస్తామని చెబుతూ.. జగనన్నకు చెప్పుకుందా అనే ప్రోగ్రాంను డిజైన్ చేస్తున్నారు. అన్నింటిలాగే.. ఈ ఫోన్ కాల్ చేయగానే.. అధికారులు ఎలా పరుగులు పెట్టి సమస్యలు పరిష్కరిస్తారో సినిమా తరహాలో చెప్పడం ప్రారంభించారు. ఎంత జరగుతుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే బాధితులు.. జగన్ ను నమ్మి నమ్మి .. ఇక చావే శరణ్యమని ఫైనల్ స్టేజ్‌కు వస్తున్నారు.
పాలన ప్రారంభించినప్పటి నుండి సీఎం ఇంటి చుట్టూ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సామాన్యులను కలవడమే లేదు. ఆదుకోవాలని వచ్చే వారికి దర్శనమే ఉండదు. కానీ ప్రచారాలు మాత్రం పీక్స్‌లో ఉంటాయి. వీటిని చూసి బాధితులు .. శాననార్ధాలు పెడుతున్నా.. పట్టించుకోరు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే… చాలు తమ ప్రతాపం చాలన్నట్లుగా ఉంటున్నారు. ప్రజలను గాలికొదిలేసిన సీఎం… ఉంటే.. రాష్ట్రం ఎలా ఉంటుందో..ఏపీ పరిస్థితి ఉంతే ఉందని.. పలు చోట్ల బాధితులు శాపనార్థాలు పెడితే..అందులో వారి తప్పేం లేదు. పాలన తీరే అంత ఉంది మరి.