వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన దాడి.. ఆయన అభిమానులను… షాక్‌కు గురి చేసింది. తట్టుకోలేకపోతున్నారు. పరిస్థితి చాలా తేడాగా ఉంది. ఇప్పటికే సాక్షి పత్రికలో .. ఏ ఊరిలో ఎవరు చనిపోయాలో లెక్కలు రాసుకుంటున్నారు. అడ్రస్‌లతో సహా.. జాబితాలను రెడీ చేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. హెలికాఫ్టర్ మరణం తర్వాత… సాక్షి పత్రికలో వచ్చిన.. మరణాల జాబితా గుర్తుకు వస్తోంది. ఆ తర్వాత వారిని ఓదార్చడానికి జగన్ చేసిన.. జాతర యాత్ర గుర్తుకు వస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ … ప్రమాదానికి గురైనట్లు తెలిసిన వెంటనే… ఏపీ ఆయన చనిపోయినట్లులో.. ఓ రకమైన ఉద్వేగపూరితమైన వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అలా చనిపోయిన వారి సంఖ్య నాలుగువేలుపై మాటే. నియోజకవర్గానికి పది, పదిహేను మంది ఉన్నారు. వాళ్లందరూ.. వైఎస్ చనిపోయాడన్న ఆవేదనతోనే గుండెలు ఆపేసుకున్నారు. అదే సందర్భంలో.. వైఎస్ వల్ల… బాగా సంపాదించుకున్న వారు కానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ… ఆయన బంధువులు కానీ.. ఎవరికీ చిన్న జ్వరం కూడా రాలేదు. అది వేరే విషయం. అయితే.. వైఎస్ ఖాతాలో వేసిన మరణాలన్నీ… సహజ మరణాలని.. ఇందులో ఎయిడ్స్‌తో చనిపోయిన వారు కూడా ఉన్నారని… కొన్ని మీడియాలు రిపోర్ట్ చేశాయి కానీ… అది మహానేతను అవమానంచడమేనని జగన్ వాదిస్తూంటారు.
అయితే అప్పటికి.. జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన ఉండకపోవచ్చు. ఎందుకంటే… అప్పటి వరకూ.. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ.. పరిస్థితులు ముందుగానే ఊహించారు కాబట్టి.. ఓదార్పు యాత్ర చేసి.. ఆ పేరుతో… కాంగ్రెస్‌కు జెల్లకొట్టాలనుకున్నారు కాబట్టే.. వైఎస్ చనిపోయిన మరుక్షణం నుంచే.. ఓదార్పు యాత్రకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆ ప్రకారం… ఆదిలాబాద్ నుంచి.. చిత్తూరు వరకు… అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా సహజ మరణాలను.. వైఎస్ ఖాతాలో వేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి జాతరలా సాగిన ఓదార్పుయాత్ర.. తర్వాత… తెలంగాణలో ఆపేశారు. అక్కడ పార్టీ లేదన్న కారణంగా.. వైఎస్ కోసం చనిపోయిన వారిని ఓదార్చలేదు. ఇప్పుడు కొత్తగా… మరో ఓదార్పు యాత్రకు.. తనపై జరిగిన కోడి కత్తి దాడితో… రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. దీని కోసం.. ఏపీ ప్రజలు … రెడీ కావాల్సిందేనేమో..!