జగన్ రెడ్డి ఎక్కడైనా శవాలు కనిపిస్తే తప్ప బయటకు రారు. పుంగనూరు వెళ్లేందుకు తాజాగా రెడీ అయ్యారు. ఎందుకంటే అక్కడో ఏడేళ్ల పాప చెరువులో పడి చనిపోయింది. మిస్సింగ్ కేసు నమోదయ్యాక పదకొండు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి చెరువులో మృతదేహం కనిపించింది. అసలేం జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్ రెడ్డి శవరాజకీయం చేయడానికి ఎక్కడా ఏమీ దొరకడం లేదని అనుకున్నారేమో కానీ.. ఈ పాప మిస్సయినప్పటి నుంచి వైసీపీ మీడియా సాక్షి.. ఏదో జరగబోతోందని కవరేజీ ఇస్తూ వస్తోంది. చివరికి చనిపోయినట్లుగా తేలడంతో శివాలెత్తిపోతోంది. జగన్ రెడ్డి కి శవం దొరికిందన్న ఆనందం ఏమో కానీ.. ఏ మాత్రం తగ్గడం లేదు. చిన్న పిల్లలకు రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్నారు. చిన్నారిని హత్య చేశారని సాక్షి పత్రిక తేల్చేసింది. వాళ్లకు ఎలా తెలుసనేది పోలీసులు తేల్చనున్నారు.
ఈ చిన్నారి చనిపోవడానికి… మదనపల్లి ఫైళ్లు దగ్దం కావడానికి లింక్ పెడుతున్నారు. ఆ కేసులో అంత వేగం చూపించారు.. ఈ చిన్నారి చనిపోతే పట్టించుకోరా అని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. జగన్ రెడ్డి పుంగనూరు వెళ్లి అదే ఏడుపు ఏడవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ వీరి శవరాజకీయాలు చూసి .. చిన్న పిల్లల్ని కూడా వదలరా అని సామాన్యులు ఆశ్చర్యపోతూంటారు. వీరికి మాత్రం ఏమీ పట్టదు.