ప్రజల వ్యక్తిగత సమాచారం.. ప్రైవేటు కంపెనీల వద్ద ఉందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. దాన్ని చంద్రబాబే ఇచ్చారని తీర్పు ఇచ్చేశారు. ఆయనను దొంగగా అభివర్ణించారు. ఈసీ దగ్గర ఉండాల్సిన డేటా చంద్రబాబు కంపెనీల దగ్గర ఉందని నెల్లూరులో జరిగిన శంఖారావ సభలో ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత డేటాను చంద్రబాబు ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారి ప్రశ్నించారు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చంద్రబాబుకు తెలుసని … అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటానికి అనర్హుడని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్ సంస్థలు ప్రైవేట్ కంపెనీలుి.. వాటిని సేవామిత్ర యాప్‌లు ఈ కంపెనీలే తయారు చేశాయన్నారు. ఆ కంపెనీలు ఎవరి.. ఆ ప్రైవేట్ కంపెనీలతో చంద్రబాబు, లోకేష్‌కు ఉన్న సంబంధం ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాక్షసుడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు..ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నాడని జగన్‌ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై జగన్.. తనదైన శైలిలో హత్యలు, నరకడాలు, చంపడాలు.. అనే పదాలు వచ్చేలా విమర్శలు గుప్పించారు. టీడీపీకి ఓటు వేయరని తెలిస్తే మనుషులను చంపిస్తారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. గ్రామాలను కూడా తగలబెట్టిస్తాడేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు నారాసురుని పాలన చూస్తున్నామని మండి పడ్డారు. తెలంగాణ పోలీసులకు చంద్రబాబు అడ్డుతగలుతున్నారని,, తెలంగాణ పోలీసులు న్యాయంగా సోదాలు చేస్తుంటే.. ఆ కంపెనీల యాజమాన్యాలు చంద్రబాబుకు వాట్సాప్ చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఇ లాంటి మనిషి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హుడు కాదన్నారు.
పోలీసులకు కనీస గౌరవం ఇవ్వని వ్యక్తి సీఎంగా ఎలా కొనసాగుతారని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. బహుశా జగన్మోహన్ రెడ్డి .. ఏపీ పోలీసుల విషయంలో తను వ్యహరించిన తీరును మర్చి పోయి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు.
దొంగ ఓట్లను తొలగించమని ఈసీని వైసీపీ అడగడం తప్పా? అని.. జగన్..ప్రశ్నించారు. దొంగ ఓట్లు తొలగించకుండా..కొత్త ఓట్లు చేర్చకుండా..
చంద్రబాబు కుట్రపన్ని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడు శంఖారావం సభలో ప్రసంగించినా… చంద్రబాబు పై అవినీతి ఆరోపణలు చేసే జగన్.. ఈ సారి మాత్రం.. డేటా గురించి మాత్రమేఎక్కువగా మాట్లాడారు. నిజంగానే డేటా లీక్ అయిందని..ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు.