గివ్ రెస్పెక్ట్ .. టేక్ రెస్పెక్ట్ అనేది కామన్. కానీ ఏపీ రాజకీయాల్లో జగన్ రెడ్డి అలాంటి గౌరవాన్ని బూతుగా మార్చేశారు. తాను అందర్నీ బూతులు తిడతాను.. తనను మాత్రం గౌరవంగా పిలవాలనే రూల్ ఆయన పెట్టుకున్నారు. అయితే మెల్లగా ఇప్పుడు అందరూ ఆయన భాషనే.. ఆయనపై ప్రయోగిస్తున్నారు. పరువు తీస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా నేరుగా సీఎం జగన్ కు గౌరవం ఇచ్చేది లేదని ప్రకటించారు. ఇక నుంచి ఆయనను ఏక వచనంతోనే సంబోధిస్తానని స్పష్టం చేశారు. ఏలూరు వారాహి విజయయాత్రలో ఈ విషయాన్ని ప్రకటించాను.
ఏలూరు సభ నుండి మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నా దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ ను ఇంక నుండి నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తానునని ప్రకటించారు. మా రెల్లి సోదరులు చెప్తున్నారు.. చెత్త శుభ్రం చేసే వారి మీద కూడా చెత్తకి టాక్సులు వేసే చెత్త ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. “సీఎం పీఠానికి విలువ ఇస్తాను.. జగన్కు కాదు. వైసీపీ నాయకుల రాజకీయ విలువలు మాట్లాడుతున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారు. సీఎంను ఇక నుంచి ఏకవచనంతోనే పిలుస్తాను. వైసీపీ నాయకులను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడతాను. సీఎం పదవికి జగన్ అనర్హుడని మమండిపడ్డారు.
మనం జగన్కు బానిసలం కాదు. సీఎం పదవికి బానిసలం కాదు. మనలో ఒకడు అంతే. మన శ్రమశక్తితో కట్టే పన్నులకు, ఖజానాకు సీఎం జవాబుదారీ అని గుర్తు చేశారు మన రాష్ట్ర ఖజానా రూ. 10 లక్షల కోట్లు. వాటిని ఎలా ఖర్చుపెట్టారో మనకు చెప్పాలన్నారు. జగన్ రూ. లక్షా 18 వేల కోట్లు అప్పు తీసుకుని ఎందుకు ప్రజలకు లెక్క చెప్పలేదని ప్రశ్నించారు. పోరాటం చేస్తే విజయం వస్తుందో లేదో తెలీదని, అయినా పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు.
ఏలూరు యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన యాత్ర కొనసాగించే కొద్దీ… వ్యక్తిగత దాడిని వైసీపీ పెంచుతోంది. దీంతో పవన్ కూడా రూటు మారుస్తున్నారు.