వైఎస్ జగన్‌తో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోబోతున్నారని… కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కవాతు యాత్రలో పూర్తిగా చంద్రబాబును టార్గెట్ చేశారు పవన్ కల్యాణ్. జగన్మోహన్ రెడ్డి అంటే కోపం లేదని.. చెబుతున్నారు. జగన్ వ్యక్తిగతంగా … తిట్టినా.. పవన్ కల్యాణ్‌కు కోపం లేదు. ఇదంతా ఇద్దరి మధ్య జరుగుతున్న పొత్తుల గుసగుసల్లో భాగంగా జరుగుతున్న పరిణామాలు అన్న అనుమానం చాలా మందికి ఉంది. అందుకే ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేతలు విమర్శించడం లేదు. కానీ హఠాత్తుగా నిన్న సాక్షి పేపర్లో… అలాగే… వైసీపీ నేతలు.. ఘాటు విమర్శలు చేశారు. పత్రికలో వేరెవరో అభిప్రాయాలు అన్నట్లు ఓ వ్యాసం రాసి చెడామడా తిట్టేశారు. తర్వాత ఆళ్ల నాని లాంటి ఎమ్మెల్సీలతో. .. ప్రెస్మీట్లు పెట్టించి విమర్శించారు. కాస్త ఘాటుగానే ఈ విమర్శలు ఉన్నాయి.
పొత్తుల దాకా వెళ్తుందన్న అప్రకటిత మిత్రపక్షాల మధ్య ఈ గ్యాప్ ఎందుకొచ్చందనేది చాలా మందికి అర్థం కావడం లేదు. దానికి కారణం… ఒకటే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేమిటంటే.. కవాత్ సభలో పవన్ కల్యాణ్… తనను “సీఎం … సీఎం..” అని పిలవమని… పదే పదే ఫ్యాన్స్‌ను కోరారు. అలా పిలిపిచుకుని సంతృప్తి పడ్డారు. ఇదే జగన్‌కు నచ్చలేదట. పొత్తులు పెట్టుకున్నా.. తానే సీఎం అని.. పవన్ కల్యాణ్.. సీఎం అని ఎలా పిలిపించుకుంటారనేది.. జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. పవన్ తీరు చూస్తూంటే.. వేరే ఏదో ప్లాన్‌లో ఉన్నట్లు ఉన్నారన్న అనుమానాలు జగన్‌తో తలెత్తాయంటున్నారు. అందుకే.. ఎందుకైనా మంచిదని ప్లాన్ బీ అమలు చేయమని చెప్పారట. దాని లో భాగంగానే పవన్ పై విమర్శలు ప్రారంభమయ్యాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అవడానికే పుట్టాననుకుంటారు. సీఎం పదవి కోసం.. మరొకరు పోటీలో ఉన్నారంటే.. అసలు సహించలేరు. ఆ విషయం ఆయన పార్టీలో ఉన్న వారందరికీ తెలుసు. అలాంటిది.. తనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న పార్టీ అధినేత సీఎం అని పిలిపించుకుంటే ఊరుకుంటారా..?. ఇప్పుడు మళ్లీ వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి.. రామ్ మాధవ్ హాట్లైన్లో లైన్ కలుపుకోవాలేమో..?