వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి… హాలీడే మూడ్‌లో ఉన్నారు. రెండో సారి ఆయన లండర్కు విహారయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. కొద్ది రోజుల కిందట…పోలింగ్ ముగిసిన వారం రోజులకు..స్విట్జర్లాండ్ వెళ్లారని వైసీపీ వర్గాలు చెప్పాయి. వారం రోజుల పాటు ఆయన స్విస్ లో ఉంటారని లోటస్‌పాండ్ నుంచి మీడియాకు.. లీకులు వచ్చాయి. అంతా నిజమేననుకున్నారు. అయితే.. తీరా… జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చే సమయానికి ఆయన స్విట్జర్లాండ్ పోలేదని… చండీగఢ్‌లోని ఓ రిసార్ట్‌లో రెస్ట్ తీసుకున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. దేశంలో విహారయాత్రలో ఉన్నారంటే.. ప్రైవసీ ఉండదన్న ఉద్దేశంతో.. ఇలా చెప్పారని వైసీపీ వర్గాలు తర్వాత క్లారిటీ ఇచ్చాయి.
అయితే… ఆ వారం రోజుల పాటు..జగన్ అసలు ఎక్కడకు వెళ్లారన్నదానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు మాత్రం… ఆయన లండన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా.. వైసీపీ ప్రకటించింది. పాదయాత్ర ప్రారంభించే ముందు.. ఆ తర్వాత కూడా..జగన్ ఎప్పుడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నా.,. లండన్‌కే వెళ్తున్నారు. అక్కడ జగన్ కుమార్తె…చదువుకుంటున్నారు. జగన్ లండన్ టూర్ అనగానే కుమార్తెను చూసేందుకు వెళ్తున్నారని అందరూ ఫిక్సయిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఇరవై రోజులకుపైగానే సమయం ఉంది. ఈ లోపు…మరోసారి లండన్ వెళ్లి రావాలని నిర్ణయించుకుని కోర్టు పర్మిషన్ తీసుకున్నారు.
అక్కడ వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. లండన్ వెళ్లే హడావుడిలో ఉన్న జగన్… హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌కు వెళ్లారు. కొంత మంది పార్టీ నేతలతో కలిసి.. వెళ్లి ఇంగ్లిష్ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ చూశారు. సినీ హీరో మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్… హైదరాబాద్‌లోనే అత్యంత లగ్జరీ మాల్గా పేరు పొందింది. జగన్ కు సహజంగానే సినిమాలంటే ఇష్టమనే ప్రచారం ఉంది. ఆయన ఒకప్పుడు బాలకృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారని..కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా.. ఓ సారి అసెంబ్లీ లాబీల్లో మీడియాకు చెప్పారు.