జగన్ రెడ్డికి ఇప్పుడు నిద్ర పడుతున్నట్లుగా లేదు. తన స్క్రిప్ట్ రైటర్లు రాసిన లేఖను దేశంలో అందరూ చదవాలని.. ముఖ్యంగా బీజేపీ నేతలు, హిందూత్వ వాదులు చదవాలని ఆయన ఆరాటపడుతున్నారు. ఆ లేఖను ఓ లింక్లోపెట్టి.. ఎక్స్‌లో పోస్టు చేసి.. రాత్రి నుంచి ప్రముఖుల్ని ట్యాగ్ చేస్తూ పోతున్నారు. ఒక్కో ట్వీట్‌కు ఓ పది , ఇరవై మంది ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిళ్లకు ట్యాగ్ చేస్తూ పోతున్నారు. జగన్ రెడ్డి నుంచి ఇలాంటివి కనీసం ఓ పది ట్వీట్లు వచ్చి ఉంటాయి. అందరూ బిజీపీ ముఖ్యమంత్రులతో పాటు తనపై ఎవరు ఆగ్రహిస్తారో.. అన్న భయంతో హిందూత్వ వాదులందరికీ ట్యాగ్ చేస్తున్నారు.
జగన్ రెడ్డి చేసిన పని చిన్నదేం కాదు.. పక్కోడిపై ఆరోపణలు చేసి తాను నీతి మంతుడ్నని తప్పించుకునేంత పరిస్థితి లేదు. తిరుమల శ్రీనివాసుడ్ని ఢిల్లీలో ఉత్తరాదిన తన వ్యక్తిగత అవసరాల కోసం ఎలా వాడుకున్నారో ఐదేళ్లుగా అందరికీ తెలుసు. తాను టీటీడీ బోర్డు పదవులు ఇచ్చానని ఫీలవుతున్న ఆయన ఉత్తినే ఇవ్వలేదు.. చాలా ప్రయోజనాలు పొందారు. ఇప్పుడు అలా ఇచ్చాను కాబట్టి ఈ పాపంలో బీజేపీకి భాగం ఉందని ఆయన అంటున్నారు.
తిరుమలను అపవిత్రం చేసి.. ఇప్పుు బయటపడేసరికి అందరికీ లేఖలు రాసి.. తానేం తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. కానీ.. అసలు విషయం తెలుసుకోలేనంత అమాయకులు కాదు గా బీజేపీ నేతలు. పైగా.. అందులో బీజేపీపైనే ఆరోపణలు చేస్తే వారు ఈ లేఖలను నిజం అని నమ్ముతారా ?. జగన్ రెడ్డి వారందర్నీ నమ్మించి తనపై కోపం తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంత భయపడుతున్నారో మరి !