జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టిన రోజు వచ్చిందంటే సాక్షి పత్రికకు..సాక్షి టీవీకి పండగే పండగ. ఎంత పండగ అంటే ముందు ఓ పది పేజీలు.. వెనుక ఓ పది పేజీలు ప్రకటనలు వచ్చేవి. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చేవారు. ఒక్క ఫుల్ పేజీ ప్రకటన.. పాతిక నుంచి యాభై లక్షల వరకూ ఉంటుందో. ప్రభుత్వ శాఖల నుంచి కూడా వచ్చేవి. ఎలా చూసినా.. జగన్ పుట్టిన రోజుకు సాక్షికి చదివింపులు.. కనీసం రూ. ముప్ఫై నుంచి యాభై కోట్ల వరకూ ఉండేవని చెబుతారు. మరి అధికారం పోయాక.. ఎంత కలెక్షన్ వచ్చింది?
జగన్ పుట్టిన రోజు నాడు… మొదటిపేజీలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. ఈయన అసలు పార్టీ మారిపోతారన్న ప్రచారం జరిగింది.కానీ పార్టీలోనే ఉండి..ఎంతో కొంత సమర్పించుకున్నారు. ఇక బ్యాక్ సైడ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫుల్ పేజీ ఇచ్చారు. ఆయన ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇస్తారు. ఎందుకంటే ఆయన మంచి ఇన్వెస్టర్. ఎప్పుడు ఎంత పెట్టాలో .. తర్వాత ఎలా పిండుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఐదేళ్ల కాలంలో ఆయన వెనకేసింది చిన్న మొత్తం కాదు.
ఇక జోన్ పేజీల్లో లోకల్ లీడర్లు కూడా శుభాకాంక్షలు చెప్పడానికి పేపర్ ప్రకటనలు ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు.. అన్నీ క్విడ్ ప్రో కో ద్వారా.. ప్రకటనల రూపంలో సాక్షికి కమిషన్లు తీసుకుంటారని.. ప్రకటనలు ఇచ్చిన వారిని బట్టి అర్థం చేసుకోవచ్చని ఆరోపణలు ఇందుకే వస్తాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చినట్లుగా. మొత్తానికి డబ్బు సంపాదనలో అలాంటి మార్గాన్ని జగన్ తప్ప ఎవరూ కనుక్కోలేరేమో ?