వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా.. అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా.. షో చేసేందుకు ప్రయత్నిస్తూ.. అందర్నీ … మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో.. డిప్యూటీ సీఎం హోదాలు.. వారికి ఇచ్చిన శాఖలతోనే స్పష్టమైపోయింది. ఐదుగురికి ఉపముఖ్యమంత్రి హోదాలు ఇచ్చారు కానీ.. ఏ ఒక్కరికి ప్రాధాన్యత శాఖలు ఇవ్వలేదు. అలాగే.. ఉపముఖ్యమంత్రి హోదా ఇవ్వని వారికి… ప్రాధాన్య శాఖలు ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రులకు పని లేని శాఖలా..?
ఉప ముఖ్యమంత్రి అంటే.. హోదా మాత్రమే కాదు. ఓ ప్రధానమైన శాఖ లభించినప్పుడు మాత్రమే.. ఆ హోదాకు ప్రాధాన్యం లభిస్తుంది. ఉదాహరణకు.. ఎల్కే అద్వానీ ఒకప్పుడు ఉప ప్రధానిగా ఉన్నారు. ఆయనకు అత్యంత ప్రాధాన్యమైన.. ప్రభుత్వంలో నెంబరూ టూగా భావించే హోంమంత్రిత్వ శాఖ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రిగా ఉండి… ప్రధాన శాఖ లేకపోతే.. అలంకారమే. ఇది జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవారి. ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చారు. ఆళ్ల నాని వైద్య ఆరోగ్యం, ఆంజాద్ భాషా మైనార్టీ శాఖ, నారాయణ స్వామి .. ఎక్సైజ్ శాఖ ఇచ్చారు. ఇవేమీ ప్రభుత్వంలో కీలక శాఖలు కాదు. ఒక్క పిల్లి సుభాష్‌కు మాత్రం కాస్త ప్రాధాన్యమున్న రెవిన్యూ శాఖ ఇచ్చారు. అంటే.. ఉపముఖ్యమంత్రుల హోదా ఇచ్చి వారిని అవమానించినట్లే భావించాలి.
సాధారణ మంత్రులకు హోం, ఆర్థిక, పరిశ్రమల్లాంటి కీలక శాఖలా..?
ప్రభుత్వలో ప్రాధాన్య శాఖలు అంటే.. హోంమంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ శాఖ, పరిశ్రమలు, ఇరిగేషన్ లాంటివి.. కీలకమైనవి. గతంలో తెలంగాణ అయినా.. ఏపీ అయినా డిప్యూటీ సీఎంలను ఇస్తే.. ప్రముఖమైన శాఖలు ఇచ్చి.. వారి గౌరవాన్ని కాపాడారు. ఏపీలో.. డిప్యూటీ సీఎంలుగా హోదా ఇచ్చిన కేఈ కృష్ణమూర్తికి రెవిన్యూ శాఖ, చినరాజప్పకు.. హోంశాఖ ఇచ్చారు. అంటే.. వారికి ఇచ్చిన హోదాలకు తగిన గౌరవాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినట్లే. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వ లేదు. పైగా.. డిప్యూటీ సీఎంలను అవమానించేలా కొన్ని జిల్లాల్లో వ్యవహరంచారు. ఉదారరణకు.. విజయనగరం జిల్లాలో ట్రైబల్ వేల్ఫేర్ మినిస్టర్ గా… పుష్పశ్రీవాణి ఉన్నారు. ఆమెకు డిప్యూటీ సీఎం హోదా ఉంది. అదే జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు ప్రధానమైన శాఖ దక్కింది. ఆయనే పవర్ ఫుల్ మినిస్టర్ అవుతారు. అంటే.. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని.. మామూలు మంత్రి కింద పని చేయమని చెప్పి.. అవమానించడమే..!
బలహీనవర్గాలకు కీలక శాఖలు ఎందుకివ్వలేదు..?
ఎస్సీ మహిళ అయిన మేకతోటి సుచరితకు హోంమంత్రి ఇచ్చారు. గతంలో వైఎస్ సబితా ఇంద్రారెడ్డికి చాన్సిచ్చారు. ఆ కోణంలో జగన్ నిర్ణయం తీసుకున్నారు. శాఖల కేటాయింపులో… కానీ.. డిప్యూటీ సీఎం ఇవ్వడంలో కానీ.. అంతా కావాలనే చేశారు. డిప్యూటీ సీఎంలు ఇచ్చిన వారికి… ప్రాధాన్య శాఖలు ఇవ్వలేదు. అలాగే.. ప్రాధాన్య శాఖలు దక్కిన వారికి డిప్యుటీ సీఎంలు ఇవ్వలేదు. అంటే.. కావాలనే అలా నియంత్రించారన్నమాట. తామేదో సామాజిక విప్లవం తెచ్చామన్నట్లుగా చెప్పుకుంటున్నారు కానీ… ఆర్థిక మంత్రిత్వ శాఖలాంటి వాటిని ఎందుకివ్వలేదు..? ఇది అవమానించడం కాదా..?
డిప్యూటీ సీఎంల పేరుతో ప్రధాన వర్గాలను అవమానించారా..?
సామాజిక సమీకరణాలు చూసుకుని.. ఆయా సామాజికవర్గాలను ఆకట్టుకోవడానికి డిప్యూటీ సీఎంహోదాను ప్రకటించారు. రాజ్యాంగంలో.. ఉపముఖ్యమంత్రి అనే హోదానే లేదు. అయినప్పటికీ.. ఐదు సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నప్పుడు.. శాఖల్లోనూ ప్రాధాన్యత కల్పించాల్సి ఉంది. అలాంటిదేమీ చేయలేదు. పైగా… జగన్మోహన్ రెడ్డి.. ఇలా చేయడం వల్ల డిప్యూటీ సీఎం అనే హోదాకు విలువ లేకుండా చేశారు. దీని వల్ల ఆయనకు రాజకీయంగా లాభం జరుగుతుందో లేదో కానీ.. తన రాజకీయ వ్యూహాల కోసం.. ఆయా సామాజికవర్గాలను వాడుకున్నారన్న భావన మాత్రం పెరుగుతుంది.