జగన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమలకు వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే ఆయనను లోపలికి అనుమతిస్తారు. అందుకే డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేని జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. రద్దు నిర్ణయాన్ని ప్రకటించే ముందు వైసీపీ మీడియా, సోషల్ మీడియా దాడులు చేయబోతున్నారన్న కోరస్ అందుకున్నాయి. జగన్ పై దాడులు చేస్తారని ప్రచారం చేశారు. దాడుల భయం కారణంగానే జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారని కలరింగ్ ఇచ్చారు.
నిజానికి లడ్డూ కల్తీ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత జగన్ తిరుమల పర్యటనను ఫైనల్ చేయడం అతి పెద్ద బ్లండర్ గా మారింది. ఎందుకంటే.. ఆయన ఎప్పుడు తిరుమల వెళ్లినా డిక్లరేషన్ అంశం తెరపైకి వస్తుంది. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే వివాదం వచ్చింది. కానీ జగన్ ఎప్పుడూ డిక్లరేషన్ పై సంతకం చేయలేదు. ఇప్పుడు లడ్డూ అంశంతో ఆయన కఠినమైన క్రిస్టియన్ అని బయట ప్రపంచానికి మొత్తం తెలిసిన తర్వాత డిక్లరేషన్ అడగకుండా ఉండకపోవడం అనేది జరగదు. డిక్లరేషన్ ఇస్తే తనను తాను క్రిస్టియన్ గా అంగీకరింప చేసుకున్నట్లే. ఇవ్వకపోతే హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి.
తిరుమలకు వెళ్తే ఎలాగూ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే అసలు వెళ్లకుండా.. భద్రతా కారణాలో.. మరొకటో చెబితే.. తక్కువ డ్యామేజ్ జరుగుతుందని వైసీపీ ప్లానర్లు ప్లాన్ చేశారు. కానీ. ఇంత హడావుడి చేసి చివరికి భయంతో పర్యటన రద్దు చేసుకోవడం నవ్వుల పాలయ్యేలా చేసింది.