ఇరవై మందికిపైగా ఎంపీలను ఇస్తే… కేంద్రంతో పోరాడి అయినా ప్రత్యేకహోదా తీసుకు వస్తానని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. వైసీపీ ఎంపీలకు… టీఆర్ఎస్ ఎంపీలు తోడైతే.. ఇక తిరుగు ఉండదని చెప్పారు. అలాగే.. తొలి సారి .. ఎంపీలతో సమావేశమైనప్పుడు… ప్రత్యేకహోదా కోసం అవసరం అయితే రాజీనామాలకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించారు. దాంతో..జగన్‌ది పోరుబాటేనని… అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ పర్యటనలో మాత్రం… కాస్త తేడాగా మాట్లాడారు.
ప్రధానిని అదే పనిగా కలిస్తే హోదా ఇస్తారా..?
ప్రధానితో సమావేశం తర్వాత ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదా కోసం… ప్రధానిని కావాలంటే… 30, 40 సార్లు కలుస్తానని ప్రకటించారు. ఎప్పుడో ఓ సారి ప్రత్యేకహోదా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్పందన… కేంద్రంపై.. పోరాడలేము.. అడిగి.. అడిగి.. వాళ్లిచ్చినప్పుడే తీసుకోవాలి.. లేదంటే లేదన్నట్లుగా… ఉంది. దీంతో… ఎంపీలతో రాజీనామాలకు సిద్దంగా ఉండాలన్న మాటల తీవ్రత.. ఒక్క రోజులోనే తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీలో హోదాపై ఇచ్చిన స్పందన చూస్తే.. కేంద్రంపై పోరాటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరన్న అభిప్రాయం మీడియా వర్గాల్లో ఏర్పడింది. మోడీని మచ్చిక చేసుకుని… హోదా తెచ్చుకోవాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిన హోదా..!
ప్రత్యేకహోదా అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఓటింగ్‌లో అదే ప్రయారిటీగా మారింది. నాలుగేళ్ల పాటు బీజేపీతో ప్రభుత్వంలో భాగంగా ఉండి ప్రత్యేకహోదా తీసుకు రాకుండా… నాలుగేళ్ల తర్వాత టీడీపీ.. పోరాటం పేరుతో ప్రజల్లోకి రావడంతో… వారికి అనుమానం వచ్చింది. అందుకే.. జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. ఈ విషయం… జగన్‌కూ క్లారిటీ ఉంది కాబట్టే.. ఎంపీల సమావేశంలో రాజీనామాల గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎంత కొట్లాడినా… జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నా… జగన్‌కే.. ప్రజలు ఓట్లేశారు. ఈ విషయంలో.. జగన్మోహన్ రెడ్డి.. హోదా పోరాటానికి.. సిద్ధం అయితే బాగుంటుందన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ముగ్గురు టీడీపీ ఎంపీలు పోరాడితే.. వైసీపీ ఎంపీలు కామ్‌గా ఉండగలరా..?
తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ.. ప్రత్యేకహోదా పోరాటంలో.. తమదైన స్టైల్లో.. పార్లమెంట్లో గళం వినిపించిన వారే. వాళ్లు… ఈ సారి వచ్చిన అవకాశాన్ని వదులుకునే అవకాశం లేదు. ఈ విషయంలో… వైసీపీ ఎంపీలకు.. కాస్త ఇబ్బందికర పరిస్థితే వస్తుంది. ముగ్గురు ఎంపీలే… ప్రభుత్వంపై పోరాడితే… 22 మంది ఎంపీలు ఉన్న వాళ్లు.. సైలెంట్‌గా ఉంటే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ప్రత్యేకహోదా పోరాటం విషయంలో… జగన్.. కాస్త ఎగ్రెసివ్‌గా లేకపోతే… ప్రజల్లో నెగెటివ్ సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది.