ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు క్రిస్మస్ వేడుకల కోసం వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో క్రిస్మస్ కోసం వెళ్లడం ఇదే తొలి సారి. ముఖ్యమంత్రి కాబట్టి.. సొంత జిల్లాకు.. ఏడు నెలల్లో ఏం చేశారనే ప్రశ్న వస్తుందనో… లేకపోతే.. కడపను స్వర్గంగా మార్చేయాలన్న లక్ష్యమో కానీ.. ఐదేళ్లకు సరిపడా జీవోలన్నీ… ఆయన పర్యటనకు ముందుగానే రిలీజ్ చేసేశారు. ఐదు రోజులోనే దాదాపుగా మూడు మూడు వందల కోట్ల నిధులను విడుదల చేస్తూ…. 30 వరకూ జీవోలు విడుదల చేశారు. ఏడు నెలల కాలంలో.. ఇతర ఏ ప్రాంతానికి సంబంధించి కూడా.. ఇంత వేగంగా జీవోలు విడుదల కాలేదు.
కడప మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కోసం రూ. 125 కోట్లు, 100 పడకల మెంటల్ హాస్పిటల్ కోసం రూ. 40.82 కోట్లు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం రూ. 347 కోట్లు, 100 పడకల కేన్సర్ హాస్పిటల్ జీవో, కడపలో బ్యూటీఫికేషన్ కోసం రూ. 55 కోట్లు, పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ. 63 కోట్లు , పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రూ. 17.5 కోట్లు కేటాయించారు. ఇవన్నీ.. కొన్ని మాత్రమే… ఇంకా రహస్య జీవోలు.. కొన్ని… ఇతర పనుల జీవోలు కొన్ని ఉన్నాయి. అన్ని జీవోలను కలిపి… ఒకే సారి విడుదల చేశారు. ఈ పనులు ఇప్పటికిప్పుడు ప్రారంభించినా.. మరో ఐదేళ్ల పాటు.. మరో జీవో విడుదల చేయాల్సిన అవసరం ఉండదు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత జిల్లాకు .. క్రిస్మస్ వేడుకలకు వెళ్తున్నందున.. ఆ జిల్లా కోసం ఇంత పెద్ద ఎత్తున జీవోలు విడుదల చేశారని అది సొంత జిల్లాపై ఆయన ఉన్న ప్రేమనా… లేక… మళ్లీ మళ్లీ జీవోలు విడుదల చేయాల్సిన అవసరం లేకుండా… త్వరపడ్డారా.. అన్న చర్చ అధికారవర్గాల్లో నడుస్తోంది. ఓ వైపు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న సీఎం జగన్… ఏ నియోజకర్గానికి అభివృద్ది కోసం.. రూపాయి విడుదల చేయలేదు. కానీ .. పులివెందులకు మాత్రం.. ఏకంగా పదమూడు వందల కోట్లు విడుదల చేసేశారు. ఎందుకింత తొందరపుడుతన్నారన్న చర్చ.. సహజంగానే అందరిలోనూ ప్రారంభమయింది.