ఎంత మంది శత్రువులు ఏకమైనా.. ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతానంటూ.. జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన తర్వాత చేసిన ప్రసంగంలో… శత్రువుల గురించి.. తట్టుకుని నిలబడం గురించి.. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అర్థంలో చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎంతమంది శత్రువులు ఏకమైనా తట్టుకుని నిలబడతానని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి ఆరు నెలలు మాత్రమే అయింది. ఆయనకు తిరుగులేని విధంగా.. 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే పోటీ చేశారు. అంటే.. అందరినీ ఎదుర్కొని విజయం సాధించారు. అలాంటప్పుడు శత్రువులు ఏకమవడం అనే ప్రస్తావన రాకూడదు.
కానీ.. జగన్మోహన్ రెడ్డి.. ఏదో ఆందోళనలో ఉన్నట్లుగా.. తనకు వ్యతిరేకంగా అందరూ ఏకమవుతున్నట్లుగా ఆయన ప్రకటన చేశారు. ఎలాంటి సందర్భంలోనూ… ఆయనకు ముప్పులేనంత మెజార్టీ ఉన్నప్పుడు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే.. జగన్మోహన్ రెడ్డిలో ఆభద్రతా భావం ఉందన్న వ్యాఖ్యలు వినిపించడానికి.. విశ్లేషణలు రావడానికి కారణం అవుతోంది. ఇటీవలి కాలంలో…ఆయన .. మొండిపట్టుదలతో… కేంద్రంతో సత్సంబంధాలు చెడగొట్టుకోవడం.. సీబీఐ కోర్టులో.. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోవడం వంటి అంశాలు… జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన పెంచాయన్న ప్రచారం జరుగుతోంది. పరిశ్రమలు తరలి పోతూండటం… దేశీయంగా జగన్ నిర్ణయాలు.. నెగెటివ్ యాంగిల్ లో చర్చనీయాంశం అవుతున్నాయి.
ఈ క్రమంలో.. ఆయన పై ఉన్న కేసులు మరో సారి తెరపైకి వస్తాయన్న ప్రచారం.. సోషల్ మీడియాలో ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో.. జగన్మోహన్ రెడ్డి… అందర్నీ ఎదుర్కొంటా లాంటి మాటలు మాట్లాడటం… మేకపోతు గాంభీర్యంగా రాజకీయ వర్గాలకు అనిపిస్తోంది. ఈ విషయంలో ఆయనకు ఏమైనా ప్రత్యేకమైన సూచనలు ఉన్నాయో.. లేదో ముందు ముందు జరిగే పరిణామాలు నిర్ణయించాలి.