సమాజంలో నేరం జరిగినప్పుడు… బాధితులకు త్వరగా న్యాయం జరిగి..నేరుస్తులకు త్వరగా శిక్ష పడినప్పుడే.. వ్యవస్థలో భయం పెరుగుతుందని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశంలో న్యాయవ్యవస్థ చాలా మందకొడిగా ఉందన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అందుకు.. నిర్భయ కేసును సీఎం ఉదాహరణగా చూపించారు. 8 ఏళ్లయినా నిర్భయ నిందితులకు శిక్ష పడలేదని … కోర్టు విచారణకు సంవత్సరాలకు సంవత్సరాలు పడితే… న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పోలీసు అధికారుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
వ్యవస్థలో మార్పు తేవాలన్న ఆలోచనతోనే దిశ చట్టం తెచ్చామని … దిశ బిల్లును కేంద్రానికి పంపించామని .. దిశ బిల్లు… త్వరలో చట్టం రూపంలోకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దిశ చట్టం ప్రకారం మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా…రెడ్ హ్యాండెడ్ కేసుల్లో ఏడురోజుల్లో దర్యాప్తు…14రోజుల్లో విచారణ చేసి ఉరిశిక్ష వేసేలా చట్టాన్ని రూపొందించామని గుర్తు చేశారు.