వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రుల్ని కలిసినా.. ప్రధానిని కలిసినా.. ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలకు చెప్పి.. అనుమతి తీసుకున్న తర్వాత కలవాలని… స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అంటే… వైసీపీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా.. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డికి తెలియకుండా.. ఢిల్లీలో ఎవర్నీ కలవకూడదన్నమాట. అంతే కాదు.. ఎవరూ నోరు విప్పకూడదు. టీవీ చర్చల్లో కూడా తమ అభిప్రాయాలను వెల్లడించకూడదట. ఇదే విషయాన్ని జగన్ చెప్పారు. కొంత మంది ఎంపీలు.. టీవీ చర్చల్లో పాల్గొన్న విషయం చెప్పి.. షోకాజ్ నోటీసులు .. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
జగన్ హెచ్చరికలు బయటకు తెలిసిన తర్వాత.. ఆశ్చర్యపోవడం రాజకీయవర్గాల వంతు అయింది. ఎందుకంటే.. ఎంపీలు.. స్టాంపులు కాదు. వారికంటూ.. కొన్ని బాధ్యతలు ఉంటాయి. వారి నియోజకవర్గ సమస్యల కోసం.. వారు కేంద్రమంత్రుల్ని కలుస్తారు. లేకపోతే.. మరో సమస్యపైనైనా కలుస్తారు. కానీ.. ఇలాంటి వాటినీ నియంత్రించాలని జగన్ ఎందుకనుకుంటున్నారో.. ఆ పార్టీ ఎంపీలకే అర్థం కాని విషయం. కొంత మంది సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. కొంత మంది మాత్రం.. తరచూ ప్రధాని అపాయింట్మెంట్లు కూడా అడుగుతున్నట్లుగా జగన్ భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఎంపీ రఘురామకృష్ణంరాజు.. పార్లమెంట్ సమావేశాలు జరగినప్పుడల్లా.. ప్రధానిని కలుస్తూంటారు. దానికి ఆయన పార్టీ పర్మిషన్ తీసుకోరు. అదే సమయంలో.. కేంద్రమంత్రుల్ని కూడా తరచూ కలుస్తారు. టీవీ చర్చల్లో పాల్గొని… తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటారు. రఘురామకృష్ణంరాజుని చూసి.. ఇతరులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కేంద్రమంత్రుల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది.. జగన్‌కు నచ్చడం లేదు. పార్టీ ఎంపీలు.. ఎలాంటి వ్యవహారాలు పెట్టుకోకుండా.. పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉండాలని.. ఆయన కోరుకుంటున్నారు. అందుకే.. వారిపై.. సూపర్ విజన్‌కు విజయసాయిరెడ్డిని.. మిధున్ రెడ్డిని నియమించారంటున్నారు.