ఏపీలో ఎక్కడ ఎలాంటి దారుణ ఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులమడం వైసీపీకి పరిపాటిగా మారింది. పరామర్శల పేరిట బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి అక్కడ కుటుంబాలను ఓదార్చడం మరిచి, రాజకీయ అంశాలపై మాట్లాడటం తరుచుగా జరుగుతోంది. జగన్ మాట్లాడే ధోరణి చూసిన ఎవరైనా, జగన్ మానసిక పరిస్థితిపై చర్చించుకోవడం కామన్ గా మారుతోంది.
ఇటీవల రాప్తాడు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అనే వ్యక్తి హత్యకు గురి కావడంతో.. వైసీపీ ఎప్పటిలాగే రాజకీయం ప్రారంభించింది. కూటమి కార్యకర్తలే ఈ హత్యకు ఉపక్రమించారని జగన్ ఎప్పటిలాగే ఆరోపించారు. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు ఉన్నాయని.. అందుకే వరుసగా హత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో ఓటమితోనే టీడీపీ నేతలు 20మంది దాడి చేసి లింగమయ్యను దాడి చేసి హత్య చేశారన్నారు.
ఈ హత్యకేసుపై దృష్టిపెట్టిన పోలీసులు ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. అయితే, ఇద్దరిపై మాత్రమే కేసులు ఎలా పెడతారని , ఎస్ఐ సుధాకర్ పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ.. ఈ దర్యాప్తు పక్కదోవ పడుతుందని చెప్పారు. నిందితులు ఎవరన్నది ముఖ్యం కాదు.. టీడీపీ నేతలపై కేసు పెడితేనే కేసు ప్రాసెస్ సరిగ్గా కొనసాగుతున్నట్లు అనే విధంగా జగన్ వైఖరి కనిపిస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ కేసు మాత్రమే కాదు..వైఎస్ వివేకా మర్డర్ , పాస్టర్ ప్రవీణ్ ఘటన..ఇలా ఏదైనా అవ్వని .. ఇదివరకు సీబీఐ , పోలీసు ఆఫీసర్ గా పని చేసిన అనుభవం ఉన్నట్లే జగన్ ప్రకటనలు ఉంటాయి. కేసుకు సంబంధించి చీఫ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ అవతారం ఎత్తి, కేసును టీడీపీకి ఆపాదించడమే జగన్ అసలు ఉద్దేశ్యం అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.