వైఎస్ జగన్ కు.. విశాఖ శారదా పీఠాధిపతి… స్వరూపానంద.. అచ్చమైన ఆథ్యాత్మిక గురువుగా మారారు. ఎంతగా అంటే.. జగన్ ఎక్కడకు వెళ్లి.. ఆశీర్వచనం ఇవ్వమంటే.. అక్కడకు వెళ్లి అశీర్వచనం ఇచ్చేంత గురువుగా మారారు. సాధారణంగా భక్తులు.. ఎవరైనా… స్వామిజీ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మొన్నటికి మొన్న కేసీఆర్ కూడా… విశాఖ వెళ్లి.. స్వరూపానందను దర్శించుకున్నారు. సాష్టాంగ ప్రమాణం చేశారు. అయితే.. జగన్ కోసం మాత్రం ఆయన తిరుమల వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్లి… శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ రాత్రికి… తిరుమలలోని శారదాపీఠంలో బస చేస్తారు. అందుకే.. స్వరూపానంద ప్రత్యేకంగా తిరుమల వెళ్లి జగన్ కు తన పీఠంలోనే ఆశీర్వచనం ఇవ్వనున్నారు. పాదయాత్రకు వెళ్లే ముందు కూడా జగన్ .. పాదయాత్ర ద్వారా తిరుమలకు వస్తానని ప్రకటించారు. కానీ కారులో పైకి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు కూడా.. తిరుమలలోని శారదాపీఠంలోనే జగన్ కు ఆశీర్వచనాలు అందించారు.
జగన్మోహన్ రెడ్డి హిందూమతాన్ని ఆచరించరు. ఆయన అన్యమతస్తుడు. వందకు వంద శాతం.. క్రిస్టియన్ మతాచారాలను పాటిస్తారు. తిరుమల నిబంధనల ప్రకారం.. ఆయన శ్రీవారిపై విశ్వాసం ఉందని.. దర్శించుకునే ముందు ఓ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకూ ఎప్పుడూ ఇవ్వలేదు. పైగా.. జగన్ ఎప్పుడు వెళ్లినా.. ఆయన వెంట వచ్చే … ఓ వంద, రెండు వందల మంది తిరుమలలో గందరగోళం సృష్టిస్తారు. శ్రీనివాసా.. శ్రీ వెంకటేశా.. అనే నినాదాలతో హోరెత్తిస్తారు. ఇది ప్రతీసారి వివాదాస్పదం అవుతోంది. అందుకే ఈ సారి అలా వైసీపీ కార్యకర్తలు చేసే నినాదాలను కూడా టీడీపీ ఖాతాలో వేసేందుకు… అలా టీడీపీ కార్యకర్తలు చేయబోతున్నారని.. జగన్ పై కుట్ర చేస్తున్నారని.. వైసీపీ నేతలు ముందస్తు ప్రకటనలు చేశారు.
అన్యమతస్థునికి.. శారదాపీఠం బస ఎలా ఏర్పాటు చేస్తారన్న అంశంపై.. విమర్శలు ఉన్నా.. పట్టించుకునేవారు లేరు. ఇలా తనకు అనుకూలంగా ఉండే ఆధ్యాత్మిక గురువులపై లేని భక్తి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయి. టీఆర్ఎస్ కు సన్నిహిత స్వాములుగా పేరు పొందిన చినజీయర్, స్వరూపానంద ఆశీస్సులను గతంలో జగన్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నారు.