అసెంబ్లీకి హాజరు కాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారు. చేతనైంది చేసుకోండి అని జగన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్మీట్ లో అన్నారు . అయితే ఆయనదంతా అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్థత్వం అని చాలా సార్లు రుజువు అయింది. ఇప్పుడు తనపై అనర్హతా వేటు వేస్తే గెలవడం అసాధ్యం అని అర్థం కావడంతో ఆయన ఒక్క రోజు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కంటిన్యూస్ గా మూడు సెషన్లు లేదా.. అరవై రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుంది. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ కు ఆ అర్హత వస్తుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాసెస్ పూర్తి చేస్తారు. సెలవు చీటీ స్పీకర్ కు రాసి పంపినా ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ ఒక్క రోజు అసెంబ్లీకి పోతే పోలా అనుకుంటున్నారు.
గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అలా ఒక్క రోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని … అనుకుంటున్నారు. అయితే ఇది సాంకేతికంగా మాత్రం తప్పించుకునే పద్దతి. కానీ ప్రజలు ఓట్లు వేస్తారు. వారిని తప్పించుకోలేరు కదా. ఇలా అడ్డగోలుగా అసెంబ్లీకి డుమ్మా కొడితే.. తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు?