విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ కేంద్రాన్ని నిర్మోహమాటంగా అడ్డం పెట్టుకుంటున్నారు. కేంద్రం చెప్పిందనే తాము ఒప్పందం చేసుకున్నామని అదానీతో సంబంధం లేదని జగన్ వాదిస్తున్నారు. సెకీ అదానీ దగ్గర కరెంట్ తీసుకుంటుందో.. మరెవరి దగ్గర తీసుకుంటుందో తమకు సంబంధం లేదన్నారు. జగన్ చాలా పక్కాగా కేంద్రాన్ని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీని అడ్డం పెట్టుకుంటున్నారు. లంచం వ్యవహారం లో సేఫ్ గార్డుగా వాడేసుకుంటున్నారు.
అమెరికా చార్జిషీట్లో తన పేరు లేదని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ లంచం తీసుకున్నట్లుగా ఎఫ్బీఐ నేరుగా నిర్దారించిందన్న సంగతిని ఆయన ఒప్పుకోవడం లేదు. అదానీతో విద్యుత్ ఒప్పందాలే లేవు కాబట్టి ఆ లంచం గురించి కూడా అడగొద్దన్నట్లుగా ఉంది. కానీ నిజాలు ఆయన ఒప్పుకోకపోయినంత మాత్రాన నిజాలు కాకుండా పోవు కదా. కేంద్రం అంతర్గతంగా అయినా ఈ లంచాల వ్యవహారంపై విచారణ చేయిస్తుందా లేదా అన్నది చెప్పలేము. ఎందుకంటే అదానీకి చాలా పవర్ ఫుల్.కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన కనుసన్నల్లోనే ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికైతే జగన్ కు వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన ఏ రూపంలో లంచాలు తీసుకున్నారన్నది బయటపడితే మాత్రం ఆయనను ఎవరూ కాపాడలేరు. ఇంత లంచం ఇచ్చారని ఎఫ్బీఐ చెప్పింది కానీ ఏ రూపంలో ఇచ్చారో వివరాలు బయట పెట్టలేదు. అలాబయటపడిన తర్వాత జగన్ రెడ్డి సెకీని, కేంద్రాన్ని కూడా అడ్డం పెట్టుకోలేరు.