విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన కోడి కత్తి దాడి ఘటనపై… కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునుతో పాటు మరో ఏడుగుర్ని చేర్చారు. తనపై దాడి ఘటనలో ప్రభుత్వ వైఫల్యం ఉందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని.. తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా ఏపీ పోలీసుల విచారణ ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని పిటిషన్ లో కోరారు
హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంత వరకూ పోలీసులకు విచారణకు సహకరించకపోవడంతో.. కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. విమాశ్రయంలో దాడి జరిగిన తర్వాత దర్యాప్తు కోసం.. పోలీసులకు కనీస మాత్రం… సహకరించకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. స్టేట్ మెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన పోలీసులతో మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో… ఎయిర్ పోర్టులో కత్తిని వైసీపీ నేతలు తీసుకెళ్లిపోయారు. తర్వాత శుభ్రం చేసిన కత్తిని తీసుకొచ్చి ఇచ్చారు. రక్తం మరకలు అంటిన చొక్కాని స్వాధీనం చేయాలని పోలీసులు కోరినా స్పందించలేదు. అసలు పోలీసులకు ఏ మాత్రం సహకరించలేదు.
నిజానికి పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తూ… వారి విచారణ తీరుపై నమ్మకం లేదని కోర్టుకు వెళ్తే .. ఓ అర్థం ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అసలు ఫిర్యాదే చేయకుండా.. పోలీసులు విాచరణ చేస్తున్నా సహకరించకుండా… స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ కోసం కోర్టులో పిటిషన్ వేయడం న్యాయవర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కోడి కత్తి దాఢి ఘటనపై… వైసీపీ తరపున.. హైకోర్టులో వేసిన మూడో పిటిషన్ ఇది. మొదట్లో…అమర్నాథ్ రెడ్డి, అనిల్ కుమార్… ధర్డ్ పార్టీ విచారణ కావాలని ప్రజాప్రయోజన వ్యాఖ్యం వేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇదే తరహా పిటిషన్ వేశారు. ఇప్పుడు జగన్ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కోరుతున్నారు. ఢిల్లీలోని వైసీపీ నేతలు కూడా.. కేంద్రమంత్రుల్ని కలిసి అదే కోరుతున్నారు.